బాలయ్య భగవంత్ కేసరిలో మరో యంగ్ బ్యూటీ.. శ్రీ లీలాకి అదిరిపోయే కాంపిటీషన్..!

టాలీవుడ్‌లో నందమూరి నటసింహం బాలయ్యకి ఉన్న క్రేజ్ గురించి ప్రేత్యేకంగా చెప్పాల్సిన ప‌ని తేదు. ఇక ప్ర‌స్తుతం బాల‌య్య ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా భగవంత్‌ కేసరి. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలో బాలయ్యని ఇప్పటివరకు మనం తెరపై ఎప్పుడూ చూడని క్యారెక్టర్‌లో చూపించ‌బోతోన్నాడు అనిల్ రావిపూడి.

ఈ సినిమాలో బాలయ్య కి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అంతేకాకుండా బాలయ్యకు కూతురు పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీ లీల నటిస్తుంది. ఇదే కాకుండా ఈ సినిమాలో మరో యంగ్ బ్యూటీ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఓ కిలక పాత్రలో కనిపించనిందని టాక్. రీసెంట్ గానే బ్రో సినిమాలో సిస్టర్ రోల్ లో నటించిన ప్రియా ప్రకాష్ ఈ సినిమాలో విలన్ సిస్టర్ గా నటించబోతున్నట్లు తెలుస్తుంది.

అంతేకాదు బాలయ్య , ప్రియ ప్రకాష్ మధ్య వచ్చే సీన్స్, డైలాగ్స్ కూడా చాలా ఎమోషనల్ గా ఉండబోతున్నాయట. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో హోరేక్కిపోతుంది. ఇద్దరు యంగ్ హీరోయిన్స్.. ఒక సీనియర్ మాస్ హీరో.. స్టార్ హీరోయిన్‌.. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కలిస్తే బ్లాక్ బస్టర్ ప‌క్క అంటున్నారు నెటిజ‌న్స్‌.