ఉత్తరాంధ్రలో వైసీపీకి పోటీగా టీడీపీ..ఆధిక్యం ఎవరిదంటే?

ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు..అక్కడ ఆధిక్యం సాధించాలని రెండు ప్రధాన పార్టీలు గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఉత్తరాంధ్రలో మెజారిటీ సాధిస్తే రాష్ర్టంలో అధికారం సాధించడం సులువే. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ వన్ సైడ్ గా గెలిచేసింది. ఉత్తరాంధ్రలో మూడు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. మూడు జిల్లాలు కలిపి 34 సీట్లు ఉన్నాయి.

గత ఎన్నికల్లో వైసీపీ 28 సీట్లు గెలుచుకోగా, టి‌డి‌పికి 6 సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే వైసీపీ ఏ స్థాయిలో విజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు. శ్రీకాకుళంలో 10 సీట్లు ఉంటే వైసీపీ 8, టి‌డి‌పి 2 సీట్లు గెలుచుకుంది. విజయనగరంలో 9కి 9 సీట్లు వైసీపీ కైవసం చేసుకుంది. అటు విశాఖలో 15 సీట్లు ఉంటే వైసీపీ 11, టి‌డి‌పి 4 సీట్లు గెలుచుకుంది. అంటే వైసీపీ వన్ సైడ్ గా గెలిచేసింది. అయితే ఇప్పుడు అక్కడ రాజకీయ పరిస్తితులు మారుతున్నాయి. వైసీపీకి ధీటుగా టి‌డి‌పి బలపడుతుంది.

ఇటీవల వచ్చిన ఓ సర్వేలో వైసీపీకి దాదాపు 48 శాతం ఓటు బ్యాంకు ఉంటే..టి‌డి‌పికి 47 శాతం ఓటు బ్యాంకు ఉంది. అంటే రెండు పార్టీలు దగ్గర దగ్గరగా ఉన్నాయి. సీట్ల విషయంలో కూడా దగ్గరగానే ఉన్నాయని తెలుస్తుంది. వైసీపీకి సుమారు 17 సీట్లు గెలిచే ఛాన్స్ ఉంటే..టి‌డి‌పికి 15 సీట్లలో ఛాన్స్ ఉంది. రెండు సీట్లలో జనసేన ప్రభావం కనిపిస్తుంది.

అదే సమయంలో టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే ఆధిక్యం ఈ రెండు పార్టీలదే అవుతుందని తెలుస్తుంది. జనసేన ప్రభావం విశాఖ జిల్లాలో ఎక్కువగా ఉంది. విశాఖ నగరంలోని నాలుగు సీట్లు, పాయకరావుపేట, ఎలమంచిలి, అనకాపల్లి, గాజువాక, భీమిలి సీట్లలో ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతానికి వైసీపీకి లీడ్ ఉంది..కానీ టి‌డి‌పి-జనసేన కలిస్తే వైసీపీకి ఎదురుదెబ్బే.