ట్రైలర్: అందరినీ కంటతడి పెట్టిస్తున్న విమానం ట్రైలర్..!!

నటుడు సముద్రఖని, అనసూయ, మీరాజాస్మిన్ , మాస్టర్ ధృవన్, రాహుల్ రామకృష్ణ ,ధనరాజ్ తదితరులు సైతం నటిస్తున్న చిత్రం విమానం. ఈ సినిమా తమిళ్, తెలుగు భాషలలో ఒకేసారి తెరకెక్కించారు. డైరెక్టర్ శివప్రసాద్ మానాల దర్శకత్వం తెరకెక్కించారు. మీరాజాస్మిన్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే విమానం సినిమాకు సంబంధించి పలు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిత్ర బృందం వేగవంతం చేస్తోంది ఇప్పటికి అనసూయకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల కూడా చేయడం జరిగింది.

Vimanam Trailer: Samuthirakani's moving act is one of the highlights

ఇక అందుకు సంబంధించిన పాట కూడా విడుదల చేయడంతో అనసూయ ఇందులో బాగానే ఆకట్టుకుంది. పలు రకాల స్టర్నింగ్ లుక్ లో కూడా మెస్మరైజ్ చేసింది అనసూయ. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను చిత్ర బృందం గడిచిన కొన్ని నిమిషాల క్రితం విడుదల చేయడం జరిగింది.. ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే విమానం ఎక్కాలని తన కొడుకు కోరికను తీర్చేందుకు కన్నతండ్రి పడే ఆవేదనను ఈ సినిమా ట్రైలర్లో అద్భుతంగా చూపించారు. కన్న కొడుకు ఎలాగైనా విమానంలో వెళ్లాలని రూ.10 వేల రూపాయల కోసం తండ్రి పడ్డ కష్టం సైకిల్ కూడా అమ్మేసి శీను అందరిని కంఠతడి పెట్టించేలా కనిపిస్తోంది..

ముఖ్యంగా అనసూయ రాహుల్ రామకృష్ణ మధ్య సన్నివేశాలు కూడా అందరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా ట్రైలర్ విడుదలవ్వడంతో ఈ సినిమా పైన భారీగానే అంచనాలు పెరిగిపోతున్నాయి జూన్ 9వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. జి స్టూడియోస్ కిరణ్ కొర్రపాటి క్రియేషన్ వర్క్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ముఖ్యంగా ఈ చిత్రంలో సముద్రఖని అంగవైకల్యంతో అద్భుతంగా నటిస్తున్నట్లుగా ఈ సినిమా ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.