అనసూయని టాలీవుడ్ దూరం పెట్టిందా..?

బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో కార్యక్రమం ఎంత పాపులారిటీని పొందిందో అందరికీ తెలిసిందే.. జబర్దస్త్ షో వల్ల మంచి పాపులారిటీ సంపాదించింది అనసూయ..అలాగే ఈ షో ద్వారా యాంకర్లు కూడా అంతకంటే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్నారు. ముఖ్యంగా అనసూయ మంచి క్రేజ్ను దక్కించుకుంది. ఈమె కింద స్థాయి నుండి అంచలంచలుగా ఎదుగుతూ ఇప్పుడు యాంకర్ నుంచి హీరోయిన్ స్టేజ్ కి వెళ్ళింది.

Anasuya Bharadwaj Movies, News, Photos, Age, Biography

ఈమె ఒకప్పుడు ఒక చిన్న ఉద్యోగం చేసేది.. కానీ బుల్లితెరపై అవకాశము వచ్చిన తర్వాత వెండితెరపై కూడా అవకాశాలను అందుకుంది. ఆమెకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ చాలా అద్భుతంగా పండించింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా బుల్లితెరని వదిలిపెట్టేది కాదు కానీ కొన్ని కారణాల చేత వదిలేయవలసి వచ్చిందట.

Anasuya Bharadwaj Looks Stellar In Her Traditional Avatar; See Photos

వరుస సినిమాలను చేయాలని అనుకొని సినిమా ఇండస్ట్రీకి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తున్నందున జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేస్తున్నట్లు యాంకర్ అనసూయ ప్రకటించింది. అయితే అనసూయ ఎప్పటినుంచి జబర్దస్త్ షో ని వదిలిపెట్టిందో అప్పటినుంచి ఆమెకు సమస్యలు ఎదురయ్యాయి..

అనసూయ అభిమానులు వెండితెరపై అప్పుడప్పుడు అనసూయని చూస్తున్నాము కానీ బుల్లితెరపై ఆమె డైలీ కనిపించేది.దీన్నిబట్టి అనసూయ పాపులారిటీ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అనసూయ బుల్లితెరను వదిలేసి వెండితెరపై వరుస సినిమాలు చేయాలనుకుంటున్న ఫిలిం మేకర్స్ అనసూయను లైట్ తీసుకుంటున్నారనీ వార్తలు వినిపిస్తున్నాయి.

జబర్దస్త్ లో ఉన్నప్పుడు ఆమెకు మంచి పాపులారిటీ ఉండేది కనుక ఆ పాపులారి తమ సినిమాలకు ఉపయోగపడుతుందని చాలామంది ఆమెను తీసుకునేందుకు ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు జబర్దస్త్ లో ఆమె లేని కారణంగా సినిమాల్లో తక్కువ అవకాశాలు వస్తున్నాయని అభిమానులు అభిప్రాయంగా తెలుపుతున్నారు. మరి రాబోయే రోజుల్లో రియంట్రీ ఏమైనా ఇస్తుందేమో చూడాలి మరి అనసూయ.