బిగ్ బ్రేకింగ్‌: మెగా ఇంట్లో మోగిన‌ పెళ్లి బాజాలు.. వ‌రుణ్ తేజ్‌-లావ‌ణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ లాక్‌!?

మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. నాగ‌బాబు త‌న‌యుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ పెళ్లి పీటలు ఎక్క‌బోతున్నాడు. ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్‌ ప్రేమలో ఉన్నారని.. పెళ్లి కూడా చేసుకుంటారని గ‌త‌ కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ ప్రచారమే నిజం కాబోతోంది. వ‌రుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ లాక్ అయింది. జూన్ 9న లావణ్యతో వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరగనుందట. ఇందుకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయ‌ని విశ్వసనీయ వ‌ర్గాల‌ సమాచారం. కుటుంబ సభ్యులు, కొంత మంది అతిథుల సమక్షంలోనే ఈ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది.

పెళ్లి కూడా ఈ ఏడాది చివర్లోపు జరుగుతుందట‌. అయితే పెళ్లి మాత్రం ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో చాలా గ్రాండ్ గా నిర్వ‌హించ‌నున్నార‌ట‌. కాగా, వ‌రుణ్ తేజ్‌-లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్స్ స‌మ‌యంలో ఏర్ప‌డ్డ ప‌రిచ‌యమే ప్రేమ‌గా మారింది. ఇరు కుటుంబ‌స‌భ్యులు వీరి ప్రేమ‌ను అంగీక‌రించ‌డంతో పెళ్లికి సిద్ధం అయ్యారు. సినిమాల విష‌యానికి వ‌స్తే.. వరుణ్ తేజ్ ప్రస్తుతం `గాండీవధారి అర్జున` అనే సినిమాలో నటిస్తున్నాడు. లావ‌ణ్య త్రిపాఠి కెరీర్ అంత కూల్ గా లేక‌పోయినా.. అవే అడ‌పా త‌డ‌పా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తోంది.