చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని ప్ర‌త్యేక‌త‌ల‌తో `ఆదిపురుష్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. అంచ‌నాలు పెంచేస్తున్న మేక‌ర్స్‌!

రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న మైథ‌లాజిక‌ల్ మూవీ `ఆదిపురుష్‌` విడుద‌ల‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇందులో రాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా కృతి స‌న‌న్‌, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ న‌టించారు. జూన్ 16న ఈ చిత్రం ప్ర‌పంచవ్యాప్తంగా వివిధ భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ఊపందుకున్నాయి.

ఆదిపురుష్ బిజినెస్ కూడా క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో జ‌రుగుతోంది. ఇక‌పోతే జూన్ 6వ తేదీ తిరుప‌తిలో `ఆదిపురుష్‌` ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే మేక‌ర్స్ ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. అయితే చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని ప్ర‌త్యేక‌త‌ల‌తో భారీ ఎత్తున ఈ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఆదిపురుష్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ లో ఏకంగా 200 మంది సింగర్లు మ‌రియు 200 మంది డ్యాన్సర్లు ప్రదర్శనలు ఇవ్వబోతున్నారట.

అలాగే ఈ ఈవెంట్ లో ప్రత్యేకంగా తయారు చేసిన బాణాసంచాను కాల్చ‌బోతున్నార‌ట‌. వీటిని కాల్చిన సమయంలో `జై శ్రీరామ్` అనే శబ్దాలు వస్తాయని అంటున్నారు. కేవలం వీటి కోసమే దాదాపు యాభై లక్షలకు పైగా ఖర్చు చేయనున్నారని తెలుస్తుంది. ఇలా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మ‌రెన్నో ప్ర‌త్యేక‌తలు, విశేషాలు ఉన్నాయ‌ని టాక్ న‌డుస్తోంది.