అప్పుడే భార్య కి కండీషన్స్ పెట్టిన హీరో శర్వానంద్.. పెళ్ళిలో అంత గొడవ జరిగిందా..?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న శర్వానంద్ ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నాడు . హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి గారి అమ్మాయిని శర్వానంద్ ఘనంగా పెళ్లి చేసుకున్నారు. నిన్న రాత్రి 11 గంటల 3 నిమిషాల ప్రాంతంలో రాజస్థాన్లోని జైపూర్ లో లీలా ప్యాలెస్ లో గ్రాండ్ గా వీరి పెళ్ళి జరిగింది . కుటుంబ సభ్యులు – శ్రేయోభిలాషులు ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు . అంతేకాదు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ స్పెషల్ గా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి భారీ గిఫ్ట్ అందించారు.

పెళ్లి మండపంలో పూజారి మంత్రోత్సవాల తో పెళ్లి కార్యక్రమం హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగింది . ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి . అయితే పెళ్లి మండపంలోనే శర్వానంద్ తన భార్య రక్షిత రెడ్డికి కండిషన్స్ పెట్టాడన్న అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . అది కోపంగా కాదులేండి సరదాగా. ఫోటోకి ఫోజులు ఇచ్చే క్రమంలో ..ఫోటోకి కి ఎక్స్ ప్రేషన్ ఇలా పెట్టు అలా పెట్టు అంటూ శర్వానంద్ అన్ని విషయాల్లో కలగజేసుకున్నారట.

అంతేకాదు ఇప్పటినుంచే శర్వానంద్ తన భార్య రక్షిత రెడ్డి పై ప్రేమ ఎక్కువగా చూపిస్తున్నారని ఓవర్గా కేర్ తీసుకుంటున్నాడు అంటూ కళ్యాణ మండపంలో ఆయన బిహేవ్ చేసిన పద్ధతి హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యేలా చేశారని పెళ్లికి హాజరైన వాళ్ళు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు శర్వానంద్ ఫ్రెండ్స్ పెళ్ళిలో పెద్ద గొడవ చేశారని ..తాగేసి రచ్చ రంబోలాగా క్రియేట్ చేసి కాసేపు కళ్యాణ మండపంలో హడావిడి సృష్టించారని.. అయితే ఫైనల్లీ ఎట్టకేలకు అంత కూల్ గా సర్దుమనిగి పెళ్లి ఎటువంటి ఆటంకాలు లేకుండా టైం కి జరిగి పోయిందని ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఫైనల్లీ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ అయిపోయారు. ఇక మిగిలింది ప్రభాసే ..ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తాడో ప్రభాస్ వేచి చూడాల్సిందే..!!?