మ‌హేష్ `గుంటూరు కారం` ష‌ర్ట్‌కు మార్కెట్‌లో య‌మా డిమాండ్‌.. ఇంత‌కీ ధ‌రెంతో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం `గుంటూరు కారం` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీలీల, పూజా హెగ్డే ఇందులో హీరోయిన్లుగా నటిస్తుంటే.. జగపతిబాబు కీలక పాత్రను పోషిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర వేగంగా జరుగుతోంది. అయితే ఇటీవల కృష్ణ జయంతి సందర్భంగా టైటిల్ తో పాటుగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ బయటకు వదిలిన సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ మాస్ లుక్ లో ఆకట్టుకున్నాడు. అలాగే ఈ గ్లింప్స్ వీడియోలో మహేష్ ధరించిన రెడ్ కలర్ చెక్ షర్ట్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు, ఇప్పుడు ఈ షర్ట్ కు మార్కెట్లో య‌మా డిమాండ్ ఏర్పడింది. ప్ర‌ముఖ సంస్థ‌ అయిన ఈ కామర్స్ లో ఈ షర్ట్ అందుబాటులో ఉండడంతో.. మహేష్ అభిమానులు ఆ షర్ట్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఇక ఈ షర్ట్ ధ‌రెంతో ఎంతో తెలుసా.. రూ.3,000. అయితే అంత ధ‌ర పెట్టి కొనలేని అభిమానుల కోసం పలు డమ్మీ బ్రాండ్ కు చెందినటువంటి షర్ట్స్ కూడా మార్కెట్లోకి వ‌చ్చాయి. గుంటూరు కారం ఫస్ట్ గ్లింప్ విడుదలైన క్షణం నుంచి మార్కెట్లో మ‌హేష్ ధ‌రించిన ష‌ర్ట్ కు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో పలు డమ్మీ బ్రాండ్ కు చెందినటువంటి కంపెనీలు ఇలాంటి షర్ట్స్ తయారు చేసి మార్కెట్లోకి పెద్ద ఎత్తున తీసుకోవచ్చారు. అత్యంత తక్కువ ధరకే ఒకటి ఉంటే మరొకటి ఫ్రీ అంటూ భారీ ఆఫర్ కూడా ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.