ఆ డైరెక్టర్ వల్ల చాలా ఇబ్బంది పడ్డా.. కృతి శెట్టి కామెంట్స్..!!

డైరెక్టర్ సుకుమార్ శిష్యుడుగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.. ఆ తరువాత వరుసగా రెండు సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. కానీ ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ కావడంతో ఈమె కెరియర్ కాస్త సందీప్దంలో పడిపోయింది. తన అందం అభినయంతో కుర్రకారులను కట్టిపడేసిన కృతి శెట్టి సోషల్ మీడియాలో మాత్రం తరచు అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది.

Lingusamy sir and Ram are like family: Krithi Shetty | Tamil Movie News -  Times of India
తన మొదటి సినిమాతోనే రెచ్చిపోయి లిప్ లాక్ సన్నివేశాలు నటించిన కృతి శెట్టి ఆ తర్వాత చిత్రాలలో అలాంటి సన్నివేశాలలో నటించలేదు. ప్రస్తుతం కృతి శెట్టికి బ్యాక్ టైం నడుస్తుందని చెప్పవచ్చు. చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ గాని మిగులుతున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.. ఒక స్టార్ డైరెక్టర్ కారణంగా తాను చాలా ఇబ్బందులు పడ్డానని తెలియజేసింది.

కృతి శెట్టి, రామ్ పోతినేని కలిసి నటించిన వారియర్ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు లింగస్వామి దర్శకత్వం వహించారు. ఆయన తమిళ దర్శకుడు కావడంతో ఆయన తెలుగు భాషలో కొంచెం తమిళ యాస కూడా మిక్స్ అయి ఉంటుంది దాంతో కృతికి ఆయన తెలుగు అర్థం కాక చాలా ఇబ్బంది పడ్డాను అని తెలియజేసింది. కానీ డైలాగులు చెప్పే విషయంలో మాత్రం రామ్ హెల్ప్ చేశారని తెలిపింది ఆ తర్వాత తెలుగును అర్థం చేసుకొని చెప్పానంటూ తెలియజేసింది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.