జబర్దస్త్ లోకి రాకముందు చమ్మక్ చంద్ర ఏం చేసేవారో తెలుసా..?

ఈటీవీలో ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ కామెడీ షో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది.. టిఆర్పి రేటింగ్ లో కూడా ముందుగా దూసుకుపోతున్న షో అని కూడా చెప్పవచ్చు. ఈ కామెడీ షో నుంచి ఎంతోమంది కమెడియన్ తెలుగు తెరకు కమెడియన్ గా, హీరోగా కూడా పరిచయమయ్యారు. అలా జబర్దస్త్ షో వల్ల పాపులర్ అయిన వారిలో చమ్మక్ చంద్ర కూడా ఒకరు.. లేడీస్ స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉండేవారు. ఈయనలోని కామెడీ టైమింగ్ వల్ల తెలుగులో కూడా దర్శక నిర్మాతలు ఈయనకి అవకాశాలు ఇచ్చారు.

Chammak Chandra - Zee5 News

అలా పలు చిత్రాలలో నటించి మోస్ట్ వాంటెడ్ కమెడియన్ గా పేరు సంపాదించారు. ముఖ్యంగా త్రివిక్రమ్ తేరకేక్కించే ప్రతి సినిమాలో కూడా చమ్మక్ చంద్ర కు ఒక చిన్న పాత్ర అయినా సరే ఫిక్స్ అయ్యి ఉంటుందని చెప్పవచ్చు..ఇప్పటివరకు పలు చిత్రాలలో నటించారు. రీసెంట్గా చమ్మక్ చంద్ర ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. తను జబర్దస్త్ లోకి రాకముందు పడ్డ కష్టాలను కూడా తెలియజేయడం జరిగింది.

చమ్మక్ చంద్ర మాట్లాడుతూ తాను కరీంనగర్ జిల్లాలో బాన్సువాడ సమీపంలో ఉండే వెంకటాపురం అనే తాండ ప్రాంతం చెందిన వాడనని తెలియజేశారు.. చిన్న వయసు నుండి తనకు పెద్దగా చదువు ఆసక్తి ఉండేది కాదని నటన మీదే ఎక్కువ ఆసక్తి ఉండటం వల్ల పదో తరగతి ఫెయిల్ అయిన తర్వాత ఇంటి నుండి హైదరాబాదులోకి వచ్చి ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడినని తెలిపారు.తనకి డాన్స్ కూడా బాగా వచ్చని ఏదైనా పెళ్లిళ్లకు వెళితే అక్కడ డాన్స్ వేసేవాడిని తెలిపారు. ఆ తర్వాత కొంతకాలం డాన్స్ ట్యూషన్ పెట్టానని ఆ డబ్బుతో ఫిలిం ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్సు చేశానని తెలిపారు. డబ్బులు అయిపోయాక చాలా ఇబ్బందులు పడ్డాను అప్పుడు నేను విజయ్ అనే నటుడు ఇంట్లో కొంతకాలం వంట మనిషిగా చేశానని తెలిపారు. అయితే ఆ జీతం సరిపోక బియ్యానికి బదులుగా నూకల తిని బ్రతికిన రోజులు చాలానే ఉన్నాయని తెలిపారు.