బీజేపీతో బాబు..పొత్తులో ట్విస్ట్..సీట్లు ఇవేనా?

ఏపీలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారాయి..ఇప్పటివరకు వైసీపీని గద్దె దించడానికి టి‌డి‌పి-జనసేన మాత్రమే కలిసి ముందుకెళుతున్నాయనుకునే తరుణంలో..చంద్రబాబు..కేంద్రంలోని పెద్దలతో భేటీ కావడం సంచలనంగా మారింది. మరి ఈయన అపాయింట్‌మెంట్ ఇవ్వమని కోరితే..ఢిల్లీ పెద్దలు ఇచ్చారా? లేక వారే బాబుని ఢిల్లీకి ఆహ్వానించారా? అనేది తెలియదు గాని..ఇప్పుడు బాబు..అమిత్ షాతో భేటీ కావడం సంచనలంగా మారింది.

ఒకవేళ అమిత్ షా ఒక్కరితోనే భేటీ ఉంటే ఏదైనా ప్రభుత్వ వ్యవహారం అనుకోవచ్చు. కానీ ఈ భేటీలో బి‌జే‌పి జాతీయ అధ్యక్షుడు జే‌పి నడ్డా సైతం పాల్గొన్నారు. దీంతో ఇది కాస్త పార్టీ వ్యవహారంగా మారింది. వీరి మధ్య చర్చలు చాలాసేపు జరిగాయి. అయితే టి‌డి‌పి-జనసేనతో కలిసి బి‌జే‌పి ముందుకు రావాలని బాబు కోరినట్లు కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి. అలాగే తమతో పొత్తు పెట్టుకుని సార్వత్రిక ఎన్నికల్లో కలిసి రావడానికి అంగీకరించితే ఎనిమిది ఎంపీ, 12 ఎమ్మెల్యే స్థానాలను ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ చంద్రబాబు ప్రతిపాదించారని ఓ వర్గం మీడియాలో కథనం వచ్చింది.

పొత్తులో భాగంగా బీజేపీకి విజయవాడ, విశాఖపట్నం, కడప, రాజంపేట, కర్నూలు వంటి లోక్‌సభ స్థానాలు, అటు ధర్మవరం, కదిరి, తిరుపతి, రాజమండ్రి సిటీ, గుంటూరు వెస్ట్, విశాఖపట్నం వెస్ట్.. వంటి అసెంబ్లీ స్థానాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇక తెలంగాణలో బేషరతుగా మద్దతు ఇస్తానని కూడా చంద్రబాబు ప్రతిపాదించారని చెబుతున్నారు. దీనిపై అమిత్ షా గానీ, జేపీ నడ్డా గానీ టీడీపీతో పొత్తుపై అప్పటికప్పుడు ఎలాంటి హామీ ఇవ్వలేదని మీడియాలో కథనం వచ్చింది.

అయితే ఈ కథనం వాస్తవాలకు దూరంగా ఉందనే చెప్పాలి..అసలు 2014లోనే బి‌జే‌పికి అన్నీ సీట్లు టి‌డి‌పి ఇవ్వలేదు. ఇప్పుడు జనసేనతో కూడా కలుస్తున్నప్పుడు 8 ఎంపీ, 12 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం అనేది గగనం. అసలు బాబు పొత్తుకు ప్రతిపాదించడం, బి‌జే‌పి పెద్దలు ఇంకేం చెప్పకపోవడం అనే కథనంలో వాస్తవాలు కనిపించడం లేదు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ అంశం ఎటువైపుకు వెళుతుందో.