ఫిదా సినిమా స్టోరీ ముందుగా ఆ హీరో.. హీరోయిన్ కు రాసిన కథనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచకుండా డైరెక్టర్లలో జయంత్ సి ఫనర్జీ కూడా ఒకరు.. ఈయనకు కూడా టాలీవుడ్ లో మంచి క్రేజీ ఉంది. వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాం రా సినిమాతో ఈయన డైరెక్టర్గా పరిచయమయ్యారు.. 1997లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది.కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్గా అంజలా ఝువెరి నటించిన తన తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ జయంత్.

Fidaa' completes 3 years of release: Making video of the Varun Tej and Sai  Pallavi starrer unveiled | Telugu Movie News - Times of India

ఆ తర్వాత అగ్ర హీరోలతో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. చాలా రోజుల తర్వాత జయంతి మరో సినిమా అని తెరకెక్కించలేదు. ఆయన దర్శకత్వంలో చివరిగా వచ్చిన చిత్రం తీన్ మార్.. చాలాకాలం మీడియాకు దూరంగా ఉన్న ఈయన ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన ఫిదా సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు

Here's why Deepika Padukone thanked Mahesh Babu - India Today

2017లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది.. ఇందులో వరుణ్ తేజ్ సాయి పల్లవి జంటగా నటించారు.ఈ సినిమాలో వరుణ్ తేజ్ పాత్రని మొదట మహేష్ బాబు నటించాల్సి ఉండగా.. సాయి పల్లవి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే కనిపించాల్సిందని తెలియజేశారు.. మహేష్ బాబుతో టక్కరి దొంగ వంటి సినిమాని తీసిన జయంత్ ఆ తర్వాత సమయంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన వద్దకు వచ్చి ఫిదా సినిమా స్టోరీ చెప్పారని తెలిపారు. ఈ సినిమా కథను మహేష్ బాబుకు రాసుకున్నానని అన్ని కుదిరితే మహేష్ కు జోడిగా దీపిక పదుకొనే అని తీసుకుంటానని శేఖర్ తెలియజేశారని తెలిపారు.. మహేష్ కు కథ చెప్పగా ఇంప్రెస్ అయ్యారని కానీ సూపర్ స్టార్ స్టార్డం ఉన్న హీరోల నుంచి ఫ్యాన్స్ ఇలాంటి సినిమాలు ఆశిస్తారా అని ఆలోచించి ఈ ప్రాజెక్టుకి సరిపోను అని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.