త్రిష తన 20 ఏళ్ల సినీ కెరీర్‌లో వదులుకున్న సూపర్ హిట్ సినిమాల లిస్ట్‌ ఇదే..!

హీరోయిన్ త్రిష సౌత్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసి త్రిష ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ లో త్రిష స్టార్ హీరోలకు జోడి కట్టింది. జూనియర్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు జోడి కట్టింది. అంతే కాకుండా ఎక్కువ కాలం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తున్న హీరోయిన్ల లిస్ట్ తీసిన అందులో త్రిష కూడా ఉంటుంది.

Versatile Actress Trisha krishnan these pictures will brighten up our mood  | - Trishakrishnan, Actresstrisha, Teluguactress, Trisha Krishnan

రీసెంట్‌గా ‘పొన్నియన్ సెల్వన్-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 40సంవ‌త్స‌రాల‌కు పైగా వ‌స్తున్నా త్రిషకు ఇంకా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. గతంలో ఓ బిజినెస్ మెన్ తో నిశ్చితార్థం చేసుకున్న త్రిష పెళ్లి వ‌ర‌కు వెళ్ళాలేదు. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. తన 20 ఏళ్ళ సినీ కెరీర్లో త్రిష కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసింది. కథలు నచ్చక కొన్ని కాల్ షీట్లు సర్దుబాటు చేయలేక మరికొన్ని సినిమాలను త్రిష వ‌దులుకుంది. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దం.

Trisha in Chiranjeevi's next?

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్లో వ‌చ్చినా ఆచార్య‌ లో హీరోయిన్ గా త్రిషని ఎంపిక చేసుకున్నారు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటూ ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తున్న మూవీలో కూడా ముందుగా త్రిషని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె నో చెప్పడంతో కాజల్ ను ఫైనల్ చేశారు.

కోలీవుడ్ ద‌ర్శ‌కుడు హరి దర్శకత్వంలో వ‌చ్చిన‌ ‘సామి’ సినిమాలో కూడా త్రిష హీరోయిన్ గా నటించింది. కానీ ‘సామి 2’ కి ఆమె నో చెప్పింది. శంకర్ డైరెక్ట్ చేసిన బాయ్స్ సినిమాలో సిద్ధార్థ్‌కు జంట‌గా త్రిష హీరోయిన్ గా చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల జెనీలియాని ఫైనల్ చేశారు. దిల్ రాజు నిర్మాణంలో ’96’ కి రీమేక్ గా వ‌చ్చిన‌ జాను మూవీలో హీరోయిన్ గా మొదట త్రిషని సంప్రదించారు.

ఒరిజినల్ లో కూడా ఆమె హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. కానీ త్రిష నో చెప్పడంతో సమంతని ఫైనల్ చేశారు. ఓమై గాడ్’ కు రీమేక్ గా తెరకెక్కిన గోపాల గోపాల సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా మొదట త్రిషని అనుకున్నారు. కానీ ఆమె నో చెప్పడంతో శ్రియాని ఫైనల్ చేశారు. ఇలా త్రిష తన కెరీర్లో ఈ సినిమాలే కాకుండా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను వదులుకుంది.