చైతూ నా `బంగార్రాజు`.. స్టేజ్‌పైనే త‌న ప్రేమ‌ను రివీల్ చేసి ట్విస్ట్ ఇచ్చిన‌ కృతి శెట్టి!

యంగ్ బ్యూటీ కృతి శెట్టి ప్రస్తుతం `కస్టడీ` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. `బంగార్రాజు` వంటి సూపర్ హిట్ అనంతరం అక్కినేని నాగచైతన్యతో కృతి శెట్టి నటించిన రెండో సినిమా ఇది. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న‌ తెలుగు తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం `కస్టడీ` ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ ఈవెంట్ లో కృతి శెట్టిన చేసిన కామెంట్స్ హాట్‌ టాపిక్ గా మారాయి. అసలే గత కొద్దిరోజుల నుంచి నాగ చైతన్య, కృతి శెట్టి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ప్రచారం సాగుతుంది. తాజాగా కృతి శెట్టి ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. స్టేజ్ పైనే చైతూకు ఇన్‌డైరెక్ట్‌గా త‌న‌ ప్రేమను రివీల్ చేసి ట్విస్ట్ ఇచ్చింది.

క‌స్ట‌డీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సినిమా కూడా అంద‌రికీ బాగా నచ్చుతుందని భావిస్తున్నాను. ఇలాంటి ఒక సినిమాకి పనిచేసే ఛాన్స్ నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో నేను చేసిన రేవతి పాత్ర మీ అందరికీ క‌నెక్ట్ అవుతంది. ఇక‌ ఎప్పుడూ నా ఫేవరేట్ చై గారే. నా `బంగార్రాజు` .. నా శివ ఆయనే. ఈ సినిమాలో ఆయన చేసిన శివ పాత్ర లవ్ లో ఒక్క రేవతి మాత్రమే కాదు .. ఎవ్వ‌రైనా లవ్ లో పడిపోతారు. నాకు స్ఫూర్తిని ఇచ్చినవారిలో ఆయన ఒకరు` అంటూ కృతి శెట్టి చైతూపై త‌న ప్రేమ‌ను కురిపించింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Share post:

Latest