ఫ‌స్ట్ కిస్ ఆమెకే ఇచ్చా.. అది న‌చ్చితేనే ఏ అమ్మాయినైనా ప్రేమిస్తా.. చైతూ బోల్డ్ కామెంట్స్‌!

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం `కస్టడీ` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అరవింద్‌ స్వామి విలన్ గా చేశాడు. శరత్‌కుమార్, ప్రియ‌మ‌ణి, సంపత్ రాజ్‌ తదితరులు కీలక పాత్రల‌ను పోషించారు.

అన్ని కార్యక్రమాల‌ను శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం మే 12న తెలుగు తమిళ భాషల్లో అట్టహాసం గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చైతూ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా తనకు ఎదురైన అన్ని ప్రశ్నలకు ఓపెన్ అండ్ బోల్డ్ గా సమాధానాలు ఇస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో `మీ ఫ‌స్ట్ కిస్‌ ఎవరితో జరిగింది’ అని అడగగా.. అందుకు నాగ చైతన్య ‘ఆఫ్ స్క్రీన్ లో చెప్పను కానీ, ఆన్ స్క్రీన్ లో మాత్రం ఏం మాయ చేసావే సినిమాలో సమంతకే ఫ‌స్ట్ కిస్ ఇచ్చా` అని చెప్పాడు.

అలాగే ల‌వ్‌, డేటింగ్ గురించి మాట్లాడుతూ.. `7వ త‌ర‌గ‌తి చదువుతున్నప్పుడు మా క్లాస్ లో ఒక అమ్మాయిని మొద‌టిసారి ఇష్టపడ్డాను, ఆ తర్వాత ఇంటర్ లో ఒక అమ్మాయితో ఫ‌స్ట్ డేట్ కి వెళ్ళాను. అయితే నేను ఏ అమ్మాయిలో అయినా చూసేది అందం కాదు.. వ్యక్తిత్వం. అది నచ్చితేనే స్నేహం అయినా, ప్రేమ అయినా. లేకుంటే దూరం గా ఉంటాను` అంటూ చైతూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Share post:

Latest