వైరల్: తన కుమారుడి ఫోటోలను మొదటిసారిగా షేర్ చేసిన స్టార్ డైరెక్టర్..!

అనతికాలంలోనే తమిళ డైరెక్టర్ అట్లీ మంచి పేరు సంపాదించాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ, పాన్ ఇండియా దర్శకుడిగా పేరొందాడు. ప్రియ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే డైరెక్టర్ కాక ముందే ప్రియకి అట్లీ అంటే ఇష్టం ఉండేది. నల్లగా ఉన్నప్పటికీ అట్లీని ఆమె ఎంతో ప్రేమించింది. చివరికి వివాహ బంధం ద్వారా ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈ జంటకు జనవరిలో పండంటి బిడ్డ పుట్టాడు. పెళ్లైన 8 ఏళ్లకు వీరిద్దరూ తల్లిదండ్రులయ్యారు. తాజాగా తన కొడుకుతో దిగిన ఫొటోను తొలిసారి డైరెక్టర్ అట్లీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే చిన్నారి ముఖం రివీల్ చేయకుండా ఎమోజీ పెట్టాడు. తన కొడుకుకు మీర్ అనే పేరును పెట్టినట్లు వెల్లడించాడు. అందరూ తన బిడ్డను దీవించాలని కోరాడు.

ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక టెంపుల్‌ను సందర్శించిన క్రమంలో ఫొటోను తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో అభిమానులు ఆ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సెలబ్రెటీలు కూడా ఈ జంటకు విషెస్ చెబుతున్నారు. తాజాగా సమంత ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపింది. కామెంట్స్‌లో కంగ్రాట్స్ డార్లింగ్స్ అని పేర్కొంది. అట్లీ దర్శకత్వంలో సమంత రెండు సినిమాలలో నటించింది. తమిళ హీరో విజయ్ సరసన అట్లీ తెరకెక్కించిన పోలీసోడు, అదిరింది సినిమాలలో ఆమె హీరోయిన్ పాత్రను పోషించింది.

అగ్ర దర్శకుడు శంకర్ దగ్గర అట్లీ ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసేవాడు. దర్శకత్వ విభాగంలో నైపుణ్యం సాధించిన తర్వాత సొంతంగా సినిమా డైరెక్షన్ చేయసాగాడు. ఆర్య, నయనతార, జై, నస్రియా ప్రధాన పాత్రల్లో నటించిన రాజా రాణి చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించాడు.ఈ చిత్రానికి అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది. నేటికీ టీవీల్లో ఈ సినిమా వచ్చిందంటే ఎంతో ఆసక్తిగా ప్రేక్షకులు చూస్తుంటారు. గుండెలు మెలి తిప్పే ప్రేమ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత వరుస హిట్‌ సినిమాలను ఆయన తెరకెక్కించాడు. తలపతి విజయ్‌తో వరుష సినిమాలు రూపొందించాడు. తేరి, మెర్సల్, బిగిల్ వంటి మూడు వరుస హిట్స్ ఇచ్చిన అట్లీ కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో పాన్ని ఇండియా లెవల్‌లో జవాన్ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్టులో విడుదల అవుతుందని తెలుస్తోంది.