`ఉగ్రం` ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 6 కోట్లకు అల్ల‌రోడు ఎంత రాబ‌ట్టాడు?

టాలీవుడ్ హీరో అల్ల‌రి న‌రేష్, డైరెక్ట‌ర్ విజయ్ కనకమేడల కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న రెండో చిత్రం `ఉగ్రం`. ఇందులో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మిర్నా మీనన్ హీరోయిన్ గా న‌టించింది. షైన్ స్క్రీన్ బ్యానర్ బ్యాన‌ర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇంద్రజ, శరత్ లోహితాశ్వ, శత్రు, శ్రీనివాస్ సాయి, బేబీ ఊహ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. భారీ అంచ‌నాల మే 5న విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డంలో విఫ‌లం అయింది. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.

తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 61 ల‌క్ష‌లు, రెండో రోజు రూ. 67 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం.. మూడో రోజు సండే అయినా స‌రే పెద్ద‌గా గ్రోత్ చూపించ‌లేక‌పోయింది. రూ. 60 ల‌క్ష‌ల షేర్ తో స‌రిపెట్టుకుంది. అలాగే వ‌ర‌ల్డ్ వైడ్ గా ఫ‌స్ట్ వీకెండ్ పూర్తి అయ్యే స‌మ‌యానికి ఈ చిత్రం రూ. 2.10 కోట్ల షేర్‌ను రాబ‌ట్టింది. ఇక ఏరియాల వారీగా ఉగ్రం 3 డేస్‌ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నిజాం: 74 ల‌క్ష‌లు
సీడెడ్: 30 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 23 ల‌క్ష‌లు
తూర్పు: 15 ల‌క్ష‌లు
పశ్చిమ: 9 ల‌క్ష‌లు
గుంటూరు: 15 ల‌క్ష‌లు
కృష్ణ: 14 ల‌క్ష‌లు
నెల్లూరు: 8 ల‌క్ష‌లు
———————————————
ఏపీ+తెలంగాణ మొత్తం= 1.88 కోట్లు(3.85 కోట్లు~ గ్రాస్‌)
———————————————

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా+ఓవ‌ర్సీస్‌: 22 ల‌క్ష‌లు
————————————————–
మొత్తం వ‌ర‌ల్డ్ వైడ్‌ కలెక్షన్‌= 2.10 కోట్లు(4.50 కోట్లు~ గ్రాస్)
————————————————–

కాగా, రూ. 6.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఉగ్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ గా నిల‌వాలంటే ఇంకా రూ. 4.40 కోట్ల షేర్‌ను అందుకోవాల్సి ఉంటుంది. మ‌రి ఈ టార్టెగ్ ను అల్ల‌రోడు అందుకోగ‌ల‌డా..లేదా.. అన్న‌ది చూడాలి.

 

Share post:

Latest