శ్రీరాముడిగా సూపర్ స్టార్ కృష్ణ.. ఆ సినిమా ఏమిటో తెలుసా..!

భారతీయ ఇతిహాసాల్లో శ్రీ రాముడుకి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ఒక వ్యక్తి ఎలా బ్రతకాలి, రాజు ఎలా పాలించాలి, భర్త ఎలా ఉండాలి, కొడుకుగా, అన్నగా.. ఇలా మన జీవితాల్లో ఏ పాత్ర తీసుకున్నా దానికి ఆదర్శంగా శ్రీ రాముడిని చూపిస్తాము. శ్రీరాముడిగా ఎన్టీఆర్, హరినాథ్, శోభన్ బాబు, కాంతారావు, వంటి వారు మాత్రమే కాదు.. నేటి జనరేషన్ కు తెలిసిన బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా నటించారు. ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

List of Telugu actors who essayed Lord Rama on screen

అయితే వెండి తెరపై శ్రీరాముడుగా సూపర్ స్టార్ కృష్ణ కూడా నటించారని మీకు తెలుసా.తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ ఓ సంచలనం. హీరోగా దర్శకుడుగా, నిర్మాతగా, అన్ని రంగాల్లో తన హవా చూపించాడు సూపర్ స్టార్ కృష్ణ. పౌరాణిక, సాంఘిక, కౌబాయ్, జేమ్స్ బాండ్ ఇలా అన్ని రకాల సినిమాలలో సూపర్ స్టార్ కృష్ణ నటించి మెప్పించారు.కృష్ణ కూడా తన కెరీర్ లో అర్జునుడు, ఏకలవుడు వంటి పౌరాణిక పాత్రలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Bangaru Bata Telugu Full HD Movie | Eswarao, Bhavana, Gopala Krishna |  Patha Cinemalu - YouTube

కానీ శ్రీరాముడిగా, కృష్ణుడిగా ఏ సినిమాలోను నటించలేదు. అయితే కృష్ణ కూడా శ్రీరాముడిగా వెండి తెరపై క్షణకాలం కనిపించారు. ఆ సినిమా ఏమిటా అని ఆలోచిస్తున్నారా. సూపర్ స్టార్ కృష్ణ సినీ కెరీర్ లో టాప్ టెన్ సినిమాల్లో నిలిచే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సినిమా గుర్తుంది కదా.. 1974 వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో కృష్ణ అల్లూరి సీతారామరాజుగా నటించి మెప్పించాడు. ఈ సినిమాలో కృష్ణ శ్రీరాముడిగా కనిపించారు.

అల్లూరి సీతారామరాజు సినిమా క్లైమాక్స్ సన్నివేశం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సీతారామరాజుని బ్రిటిష్ ప్రభుత్వపు సైనికులు గుండెకు ఎదురుగా తుపాకీ పెట్టి షూట్ చేసే సమయంలో ధైర్య సాహసాలతో తీక్షణంగా చూస్తూ ఉంటే.. కాల్చడానికి తుపాకీ ఎక్కుపెట్టిన ఒక హిందు సైనికుడికి శ్రీరాముడిగా, క్రైస్తవ సైనికుడికి జీసస్ గా, ముస్లిం సైనికుడికి ఖురాన్ గ్రంథంగా మూడు రకాలుగా కనిపిస్తారు. అయితే ఈ సన్నివేశంలో కృష్ణుడు హిందూ సైనికుడికి శ్రీరాముడిగా కనిపిస్తాడు. అలా కృష్ణ ఒక్క క్షణం పాటు అయినా శ్రీరాముడిగా నటించారు అన్నమాట. తన నటనతో అవార్డులను విమర్శకుల ప్రశంసలను అందుకున్న కృష్ణ.. డేరింగ్ డాషింగ్ హీరో అనిపించుకున్నారు.