ప్రకాశంలో డ్యామేజ్ పెంచుకుంటున్న వైసీపీ..లీడ్ లేదు.!

రాష్ట్రంలో నిదానంగా వైసీపీ బలం తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. అసలు ఆ పార్టీకి కంచుకోటలుగా ఉన్న జిల్లాల్లోనే సీన్ రివర్స్ అవుతుంది. గత ఎన్నికల్లో అన్నీ జిల్లాల్లో వైసీపీ హవా నడిచింది..ఇప్పుడు చాలా జిల్లాల్లో ఎదురుగాలి వీస్తుంది. ఇదే క్రమంలో నేతల మధ్య పోరు, అసంతృప్తి పార్టీకి మరింత మైనస్ అవుతుంది. ఈ పరిస్తితి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎక్కువగా ఉంది.

గత ఎన్నికల్లో జిల్లాలో 12 సీట్లు ఉంటే వైసీపీ 8, టీడీపీ 4 సీట్లు గెలుచుకుంది. అలా లీడ్ తెచ్చుకున్న వైసీపీ ఇప్పుడు లీడ్ పోగొట్టుకుంటుంది. జిల్లాలో టి‌డి‌పి బలం పెరుగుతుంది. పైగా వైసీపీలో ఉండే అంతర్గత పోరు మరింత డ్యామేజ్ చేస్తుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కీలక నేతల వ్యవహారం కూడా పార్టీకి మైనస్ గా మారుతుంది. ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం వైసీపీలో కలవరం పుట్టిస్తుంది. ఆయన పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మళ్ళీ బుజ్జగించిన పార్టీ పదవి చేపట్టడానికి ఆసక్తి చూపడం లేదు.

ఇటు మంత్రి ఆదిమూలపు సురేష్ ..ఇటీవల చంద్రబాబు పర్యటనలో వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. డిసెంట్ గా ఉండే ఆయన..అలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి లిక్కర్ స్కామ్ లో చిక్కులు తెచ్చుకున్నారు. అటు వైవీ సుబ్బారెడ్డి, బాలినేనిల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది.

ఇంకా జిల్లాలో పలువురు ఎమ్మెల్యేల పనితీరు పెద్దగా ఏమి బాగోలేదు. ఈ పరిస్తితులు ప్రకాశంలో వైసీపీకి డ్యామేజ్ చేస్తున్నాయి..ఉన్న ఆధిక్యం మొత్తం పడిపోతుంది.