అఖిల్‌ని ఫాలో అవుతున్న శర్వానంద్.. ఇద్దరి పెళ్లి తంతు ఒకటేగా..!

ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది.. వరుస‌పెట్టి టాలీవుడ్ యంగ్ హీరోలు పెళ్లిళ్లు చేసుకుంటూ వస్తున్నారు.. అందులో భాగంగానే యంగ్ హీరో శర్వానంద్ కూడా జనవరి 26న రక్షిత రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. వీరి ఎంగేజ్మెంట్ జరిగీ ఇప్పటికే నాలుగు నెలలు గడుస్తున్న వీరి పెళ్లికి సంబంధించి ఎటువంటి వార్తలు బయటికి రావటం లేదు. ఇక దీంతో వీరి పెళ్లిపై అనుమానాలు బలపడుతున్నాయి.

Telugu Actor Sharwanand Gets Engaged To Rakshita Reddy, A US-Based Techie -  See Pics

అయితే ఈ పెళ్లి ఆలస్యానికి ప్రధాన కారణం శర్వానంద్ ఆరోగ్యం అని కూడా ఒక మాట బయటకు వస్తుంది.. అతనికి ప్రస్తుతం హెల్త్ బాగోలేదని.. పూర్తిగా రికవరీ అయిన తర్వాతేపెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారట.. అందుకే రెండు కుటుంబాలు ఈ పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు ఓ టాక్ వినిపిస్తుంది. దీంతో వీరి పెళ్లి గురించి మరో వాదన వినిపిస్తుంది.. అఖిల్ అక్కినేని కూడా గతంలో ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని తరవాత ఏం జరిగిందో ఏమో కానీ పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది.

ఆ తర్వాత అఖిల్ తో నిశ్చితార్థం చేసుకున్న శ్రియా భూపాల్ మరో అబ్బాయి తో పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పుడు శర్వానంద్ పెళ్లి కథ కూడా ఇలానే నడుస్తుందని టాక్ కూడా వస్తుంది. దీంతో శర్వా పెళ్లి గురించి వార్తలు హై రేంజ్‌లో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ హీరో పెళ్లి కూడా అఖిల్ పెళ్లిలానే నిశ్చితార్థంతోనే ముగుస్తుందా? అనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ మొదలైంది.

Share post:

Latest