టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ రెజీనా కాసాండ్రా మొదట ఎస్ఎంఎస్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా లేకోకుండా ఉండే పరిస్థితి ఏర్పడింది. రెజీనా ఎలాంటి పాత్రలోనైనా సరే అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. గతంలో టాలీవుడ్ హీరో తో ప్రేమలో పడి విఫలం కావడం చేత ఈమె సినీ కెరియర్ మీద పెద్దగా ఆసక్తి చూపలేదని వార్తలు వినిపిస్తూ ఉండేది.
ప్రస్తుతం రెజీనా ఏడాదికి నాలుగైదు సినిమాలలో నటిస్తూ ఉన్న అందులో ఏ ఒక్కటి కూడా సక్సెస్ కాలేకపోతున్నాయి. అలాగె పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. అయితే ఈమె వెబ్ సిరీస్ మీద పెట్టిన ఫోకస్ సినిమాల మీద పెట్టలేదని తెలుస్తోంది. ముఖ్యంగా తను విలన్ గా ,హీరోయిన్ పాత్రలలో కూడా నటిస్తూ మెప్పిస్తూ ఉంటుంది. పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ అవి కూడా వర్కౌట్ కాలేకపోయాయి.
తమిళంలో కూడా పలు చిత్రాలలో నటించిన ఆవి కూడా విడుదలయ్యేందుకు చాలా సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో మైమరిపిస్తూ ఉంటుంది. కానీ ఆకట్టుకునే అందం అభినయం ఉన్నప్పటికీ కథలు ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో ఎలాంటి అవకాశం వచ్చిన ఓకే చెబుతూ చిత్రాలలో నటించడం వల్ల ఏమి బిజీ ఆర్టిస్టు కాలేకపోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈమె వయసు 32 సంవత్సరాలు. అయినప్పటికీ ఇంకా పెళ్లి ఊసే ఎత్తలేదు. మరి రాబోయే రోజుల్లో నైనా కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయం తీసుకొని సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి. సినిమాలు ఆలస్యం చేస్తే రాబోయే రోజుల్లో తెలుగు ప్రేక్షకులు ఏమైనా మరిచిపోయే అవకాశం ఉన్నది..