చిత్ర పరిశ్రమకు ఎంత మంది హీరోయిన్లు వచ్చిన.. కొత్త హీరోయిన్లు వస్తున్న ఒకప్పటి మహానటిగా పేరు సంపాదించుకున్న సావిత్రి కి ఎవరు సాటిరారు అని చెప్పాలి. చిత్ర పరిశ్రమలో తనదైన స్టైల్ లో నటించి మహానటిగా పేరు సంపాదించుకున్న సావిత్రి జీవితం ఎలా కొనసాగిందో ఎలా ముగిసిందో మహానటి సినిమాలో మనం చూసాం. మహానటి సావిత్రి జీవితంలో జరిగిన ఎన్నో విషయాలు జనాలకు ఇంకా పూర్తిగా తెలియదు.
అలాంటిది ఆమె జీవితంలో జరిగిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మహానటిగా పేరు తెచ్చుకున్న సావిత్రి తమిళ్ స్టార్ హీరో జెమినీ గణేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆయనకు పెళ్లయిందని తెలిసినా తన ప్రేమను చంపకోలేక ఆయనతోనే జీవితాన్ని కొనసాగించింది. అయితే ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే సావిత్రిని కూడా చిత్ర పరిశ్రమలో ఓ స్టార్ దర్శకుడు ప్రాణంగా ప్రేమించాడట. ఎంతలా అంటే ఆమె కోసం తన ప్రాణాలను తీసుకునే అంతలా ప్రేమించాడట.
ఆ డైరెక్టర్ మరెవరో కాదు తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకుడుగా పేరు తెచ్చుకున్న “పిళ్లై”.. దర్శకుడు పిళ్లైకి సావిత్రి అంటే ఎంతో పిచ్చి ప్రేమట.. ఆమెను చూసిన తొలి చూపులోనే ప్రేమలో పడిపోయారట.. అయితే తన ప్రేమను సావిత్రి కి ఎలా చెప్పాలో తెలియక సీనియర్ నటుడు గుమ్మడి గారితో తన ప్రేమ విషయం చెప్పి సావిత్రిని పెళ్లి చేసుకుంటానని చెప్పమన్నారట. కానీ గుమ్మడి గారు సావిత్రి అప్పటికే జెమినీ గణేషన్ ప్రేమలో ఉందని నీ ప్రేమను అంగీకరించదు ఆమెను మర్చిపోయి నీ సినీ కెరీర్ నువ్వు చూసుకో గుమ్మడి ఆయనకు సలహా ఇచ్చారట.
కానీ డైరెక్టర్ “పిళ్లై” మాత్రం సావిత్రి మీద ప్రేమను మర్చిపోలేక ఏకంగా చిత్ర పరిశ్రమకే దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట. అలా సినిమాలను వదిలేసి తన సొంత ఊరికి వెళ్లి వ్యవసాయం చేసుకుంటూ ఎన్నో కష్టాలను కూడా అనుభవించారు. ఆ విధంగా సావిత్రి మీద ప్రేమను చంపకోలేక జీవితాన్ని తన కెరీర్‌ను సైతం నాశనం చేసుకున్నారట దర్శకుడు “పిళ్లై”.. ఇక ఈ విషయాన్ని గుమ్మడి తన పుస్తకంలో రాసుకొచ్చారు..!