డైరెక్టర్ మారుతి పెళ్లి వెనుక ఇంత కథ ఉందా..!!

సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే అంత సులువైన విషయం కాదు.. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలన్న సరైన స్థాయిలో ఎదగాలన్న చాలా కష్టపడడమే కాకుండా అదృష్టం కూడా కలిసి రావాలి. అలా అన్ని కలిసి వచ్చి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందారు డైరెక్టర్ మారుతి. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఏన్నో కష్టాలు పడి ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాలను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు.

ఒకప్పుడు రెండు రూపాయల జిలేబి తిని కడుపు నింపుకున్న డైరెక్టర్ మారుతి రోడ్ల పైన అరటి పండ్లు కూడా అమ్మేవారట.ప్రస్తుతం ఇప్పుడు బాగానే సంపాదించి డైరెక్టర్గా రచయితగా నిర్మాతగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతి భార్య “స్పందన”తో హాజరయ్యారు.

ఇందులో భాగంగానే వీరిద్దరి మధ్య కొనసాగిన ప్రేమాయణం గురించి పలు విషయాలను తెలియజేయడం జరిగింది.. డైరెక్టర్ మారుతి భార్య స్పందన మాట్లాడుతూ తాను స్కూల్ నుంచి తనకు పరిచయమని మారుతి తన సీనియర్ అని కూడా తెలియజేసింది. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు తన ముఖం నాకు నచ్చిందని..తొమ్మిదవ తరగతిలో తన టాలెంట్ నచ్చిందని తెలిపారు .

ఇక పదవ తరగతి పూర్తి అయిన కూడా మా ప్రేమ అలాగే కొనసాగుతూ వచ్చిందని నాకోసం తను ఆర్టీసీ బస్సులో వచ్చేవాడని నేను స్కూటీపై వెళ్లేదాన్ని ఇలా ఇద్దరము స్కూటీపై బాగా చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేశామని తెలిపింది స్పందన. వివాహానికి ముందు డైరెక్టర్ మారుతి తన భార్యను కలవడానికి చేసిన వెధవ పనులన్నీ కూడా తన భార్య డైరీలో రాసుకుందని ఈ సందర్భంగా తెలిపారు స్పందన.

Share post:

Latest