రెండో పెళ్లి ఆలోచ‌న‌లో తార‌క‌ర‌త్న భార్య‌.. అలేఖ్య తాజా పోస్ట్ తో వ‌చ్చిన క్లారిటీ!

నందమూరి వార‌సుడు, సినీ న‌టుడు తారకరత్న ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. 23 రోజులపాటు చావు బతుకుల మధ్య పోరాటం చేసిన తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయ‌న మ‌ర‌ణం నుంచి అభిమానులు, కుటుంబ స‌భ్యులు బ‌య‌ట‌ప‌డుతున్నారు.

కానీ, తార‌క‌ర‌త్న‌ను ఆయ‌న భార్య ఆలేఖ్య రెడ్డి మాత్రం మ‌ర‌చిపోలేక‌పోతోంది. ప్రేమించి, పెళ్లి చేసుకుని, జీవితాంతం తోడు ఉంటాన‌ని మాట ఇచ్చిన‌ భ‌ర్త ఇలా అర్థాంత‌రంగా వెళ్లిపోవ‌డం అలేఖ్య జీర్ణించుకోలేక‌పోతోంది. ఈ క్ర‌మంలోనే సోషల్ మీడియా ద్వారా తారకరత్న గురించి ఎమోషనల్ గా వరుస పోస్ట్ లు పెడుతూనే ఉంది.

ఇదిలా ఉంటే.. అలేఖ్య రెండో పెళ్లి ఆలోచ‌న‌లో ఉందంటూ ఇటీవ‌ల నెట్టింట ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారానికి తాజాగా అలేఖ్య ప‌రోక్షంగా క్లారిటీ ఇచ్చింది. తారకరత్న గురించి మరో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇన్‌స్టాగ్రామ్ లో తారకరత్నతో ఉన్న ఫోటోని షేర్ చేసిన అలేఖ్య‌.. `ఈ జీవితానికి నువ్వు, నేను మాత్రమే. నాకు జీవితానికి సరిపడా జ్ఞాపకాలను ఇచ్చి వెళ్ళావు. వాటితోనే జీవితాంతం బతికేస్తాను. నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను` అంటూ రాసుకొచ్చింది. ప‌రోక్షంగా అలేఖ్య త‌న‌కు రెండో పెళ్లి ఆలోచ‌న లేద‌ని తెగేసి చెప్పేసింది.

https://www.instagram.com/p/CrxvEJjAD0Z/?utm_source=ig_web_copy_link

Share post:

Latest