యాత్ర -2.. ఈసారి అంతకుమించి అనేలా..!!

దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. దీంతో రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సినిమా యాత్ర. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. డైరెక్టర్ మహివీ రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో చోటుచేసుకున్న కొన్ని కీలకమైన సంఘటనలు సంక్షేమ పథకాలను ఎలా రూపొందించారు అన్న అంశాలను కూడా అద్భుతంగా తెరకెక్కించారు.

Who is Jagan in Yatra 2? - TeluguBulletin.com
రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళం నటుడు మమ్ముట్టి ఎంతో అద్భుతంగా నటించారు. ఇదంతా ఇలా ఉండక ఈ సినిమా సీక్వెల్ ఉండబోతోందని యాత్ర విడుదల సమయంలోనే డైరెక్టర్ తెలియజేశారు. అయితే ఈ సినిమా విడుదలై ఇప్పటికీ నాలుగేళ్లు అవుతున్న ఇప్పటివరకు ఈ సినిమా పైన ఎలాంటి సీక్వెల్ అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా మహివీ రాఘవ సేవ్ ది టైగర్ అని వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ మంచి టాక్ ను తెచ్చుకుంది.

దీంతో ఇంటర్వ్యూలో పాల్గొన్నా డైరెక్టర్ యాత్ర-2 ఉంటుందని తెలిసి చెప్పారు అయితే ఈ సినిమా మొదలయ్యేది ఎప్పుడు అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి , ఆయన మరణం తర్వాత జగన్ ఎదుర్కొన్న ఇబ్బందులు చివరికి ముఖ్యమంత్రి ఎలా అయ్యారు అనే సిద్ధాంతంతో యాత్ర -2 ఉండబోతున్నట్లు వార్తలు ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ పాదయాత్ర కోసం స్కామ్ 1992 సేమ్ ప్రతి గాంధీని తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తూ వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

Share post:

Latest