ప‌రాయి గ‌డ్డ‌పై ప‌రువు పోగొట్టుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్‌.. టైమ్ బ్యాడ్ అంటే ఇదే!

బైక్ యాక్సిడెంట్ అనంతరం మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌ నుంచి వచ్చిన తొలి చిత్రం `విరూపాక్ష` కార్తీక్ వార్మ దండు ద‌ర్శ‌శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్ల‌ర్ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు.

ఏప్రిల్ 21న విడుదలైన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వంద కోట్ల క్ల‌బ్ లో చేరిన విరూపాక్ష.. ఇప్ప‌టికీ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. అయితే తెలుగులో విరూపాక్ష సూపర్ డూపర్ హిట్ అవడంతో మేకర్స్ హిందీ, మలయాళ, తమిళ భాషల్లో డబ్ వచ్చేసి విడుదల చేశారు. కానీ ఆయా భాష‌ల్లో ఈ మూవీకి పెద్ద షాక్ త‌గిలింది.

 

కంటెంట్ అద్భుతంగా ఉన్నప్పటికీ ఈ మూవీకి ఆయా భాష‌ల్లో మిశ్ర‌మ స్పంద‌న‌ను సంపాదించుకుంది. దీంతో క‌లెక్ష‌న్స్ అంతంత మాత్రంగా మారాయి. గురువారం ఆ భాషల్లో జీరో షేర్‌తో ఈ సినిమా నిరాశ పరిచింది. తెలుగు లో విడుదలైన రోజే ఆ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేసి ఉంటే మంచి రెస్పాన్స్ వచ్చి ఉండేది. కానీ, ఇక్కడ విడుదలైన పది రోజుల తర్వాత ఇతర భాషలలో రిలీజ్ చెయ్యడం ఈ చిత్రానికి మైనస్ అయ్యింది. పైగా ప్రొమోషన్స్ విషయం లో కూడా మేకర్స్ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో సొంత గ‌డ్డ‌పై గెలిచిన తేజ్‌.. ప‌రాయి గ‌డ్డ‌పై ప‌రువు పోగొట్టుకున్నాడు, టైమ్ బ్యాడ్ అంటే ఇదే అంటూ సినీ ప్రియులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Share post:

Latest