టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ప్రజెంట్ ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాలలో బిజీ బిజీగా ఉన్నాడు . రీసెంట్గా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ క్రమంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అప్పుడెప్పుడో గబ్బర్ సింగ్ సినిమాలో చూసిన పవన్ కళ్యాణ్ ని మరోసారి గుర్తు చేశారు హరీష్ శంకర్ అంటూ జనాలు ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.
వీళ్ళిద్దరి కాంబో అంటేనే జనాలకి టక్కున గుర్తొచ్చేది గబ్బర్ సింగ్. అలాంటి కాంబో మరోసారి రిపీట్ అవుతూ ఉండడంతో జనాలు ఈ సినిమాపై హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు. అయితే గ్లింప్స్ కూడా అభిమానులను తెగ ఆకట్టుకుంది . పవన్ కళ్యాణ్ ని ఎలా అయితే చూడాలి అనుకున్నారో అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని చూపించబోతున్నాడు హరీష్ శంకర్ .
అయితే ఈ సినిమా స్టార్టింగ్ లో తమిళ సూపర్ హిట్ మూవీ ‘తేరి’కి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ గతంలో వెల్లడించింది. అయితే ఎక్కడ కూడా తేరి సినిమాకి ఈ సినిమాకి మ్యాచ్ అవ్వట్లేదు అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమాలు నైనా సరే తన ఒరిజినల్ వే ఆఫ్ స్టైలింగులో నటిస్తూ సినిమాకే కొత్త అర్థం తీసుకొచ్చే నటన ఉన్న టాలెంట్ హీరో అంటూ పొగిడేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఏది ఏమైనా సరే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో సినిమా ఇండస్ట్రీ లెక్కను క్లీన్ స్వీప్ చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్ అన్నది మాత్రం వాస్తవం అంటూ చిన్న గ్లింప్స్ తోనే హింట్ ఇచ్చేశాడు హరీష్ శంకర్..!!