నా చుట్టూ ఆత్మ‌లు.. అందుకే ఆ టైమ్‌లో ఏడ్చేశా అంటూ కృతి శెట్టి సంచ‌ల‌న వ్యాఖ్యలు!

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గ‌త‌ కొద్ది కొద్ది రోజుల నుంచి `కస్టడీ` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బంగార్రాజు వంటి బ్లాక్ బ‌స్టర్ హిట్ అనంతరం అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన రెండో చిత్రమిది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు తెలుగు తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయింది.

అయితే ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. ఈ సంగతి పక్కన పెడితే.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి బంగార్రాజు సినిమా గురించి మాట్లాడుతూ సంచలన‌ వ్యాఖ్యలు చేసింది. `బంగార్రాజు సినిమా నా మ‌న‌సుకు ఎంతో న‌చ్చిన సినిమా. ఈ చిత్రాన్ని మన సంప్రదాయాలకు అనుగుణంగా రూపొందారు. మా శెట్టి కుటుంబాల్లో ఓ నమ్మకం ఉంది. మన పూర్వీకులు ఆత్మల రూపంలో ఉంటారని బలంగా నమ్ముతాం.

వారు మా చుట్టూ ఉంటూ మ‌మ్మ‌ల్ని కాపాడుకుంటారని విశ్వసిస్తాం. అందుకే మేము వాళ్లను ఆరాధిస్తాం. బంగార్రాజు సినిమా చూసినప్పుడు మన పూర్వీకులను, సంస్కృతిని గుర్తుకు తీసుకొచ్చింది. ఈ నమ్మకాలను తెరపై చూసినప్పుడు నేను ఎమోషనల్ అయ్యాను. సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ కల్యాణ్ కృష్ణకు ఫోన్ చేసి చాలా సేపు ఏడ్చాను.` అంటూ కృతి శెట్టి చెప్పుకొచ్చింది. ఈమె కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. ఈ రోజుల్లో కూడా కృతి శెట్టి ఆత్మ‌లు ఉన్నాయ‌ని న‌మ్ముతుందా అంటూ చాలా మంది ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

Share post:

Latest