మ‌హేష్‌పై ఇంత పెద్ద ప్రెజ‌ర్ పెడుతున్నారా…!

ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్‌ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల‌ ముందుకు రాబోతున్న హీరోలలో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్‌ సినిమా వచ్చేనెల 16న ప్రేక్షకులకుు ముందుకు రానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వీరితోపాటు రామ్ చరణ్ కూడా తన 15వ సినిమాని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్నాడు. ఆ సినిమాకు గేమ్ ఛేంజర్ అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసి…. ఫస్ట్ లుక్ కూడా రివిల్ చేశాడు.

వీటితో పాటు పవన్ కళ్యాణ్- సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో ఫస్ట్ లుక్ పోస్టర్‌ కూడా రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్- కొరటాల కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ 30 సినిమా ఫస్ట్ లుక్ టైటిల్‌ కూడా నిన్న రాత్రి రివిల్ చేశారు. ఈ సినిమాకు దేవర అనే ఓ పవర్ ఫుల్ టైటిల్‌ ఫిక్స్ చేశారు. ఇక అందులో ఎన్టీఆర్ లుక్ కూడా బీభత్సంగా ఉంది. ఇక ఇప్పుడు వీరందరిలో మిగిలింది మహేష్ బాబు మాత్రమే.

మహేష్ కూడా తన 29వ సినిమాని త్రివిక్రమ్‌తో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అవగా మధ్యలో కొన్ని అవరోధాలు కారణంగా వాయిదా పడుతు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్స్ కూడా త్రివిక్రమ్ బయటకు రానివ్వటం లేదు. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్‌ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

South Entertainment Live Updates: Mahesh Babu's SSMB 28 Title Rumour,  Akhil's Big Note After Agent's Failure - Filmibeat

గత నెలలో మహేష్ బాబు లుక్‌కు సంబంధించి ఓ పోస్టర్‌ మాత్రం రివిల్ చేశారు. ఆ పోస్టర్ తప్పించి ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ కూడా ఇప్పటికి బయటకు రాలేదు. తాజా అప్డేట్ ఏమిటంటే ఈనెల 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా త్రివిక్రమ్ ఈ సినిమా టైటిల్‌ మహేష్ బాబు లుక్ రివిల్ చేయబోతున్నారని తెలుస్తుంది. మరి ఈ సినిమాలో మహేష్ ఎలాంటి లుక్ లో కనిపిస్తాడో చూడాలి.

Share post:

Latest