బాక్సాఫీస్ వ‌ద్ద `బిచ్చ‌గాడు 2` బీభ‌త్సం.. ఫ‌స్ట్ డే ఎంత రాబ‌ట్టిందో తెలుసా?

బిచ్చ‌గాడు మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా చేరువైన త‌మిళ హీరో విజ‌య్ ఆంటోనీ.. తాజాగా `బిచ్చ‌గాడు 2` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ గా కూడా వ్య‌వ‌హ‌రించాడు. అలాగే కావ్యా థాపర్ హీరోయిన్ గా చేస్తే.. హరీష్ పేరడి, దేవ్ గిల్, యోగిబాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

నిన్న తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది. బిచ్చ‌గాడు మ‌ద‌ర్ సెంటిమెంట్ చుట్టూనే క‌థ న‌డిస్తే.. బిచ్చ‌గాడు 2 చెల్లెలు సెంటిమెంట్ నేప‌థ్యంలో సాగుతుంది. అలాగే బ్రెయిన్ మార్పిడి అనే ప్ర‌యోగాత్మ‌క పాయింట్‌కు యాక్ష‌న్ అంశాల‌ను జోడించి క‌థను న‌డిపించారు. ఇక టాక్ అనుకూలంగా ఉండ‌టంతో.. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బిభ‌త్సం సృష్టిస్తోంది.

తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం త‌మిళంలో కంటే ఎక్కువ‌ వ‌సూల్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. తెలుగులో ఈ సినిమా రూ. 6.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో దిగ‌గా.. ఫ‌స్ట్ డేనే రూ. 2.32 కోట్ల రేంజ్ లో షేర్, రూ. 4.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించి దుమ్ము దుమారం లేపింది. ఇక వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 16 కోట్ల టార్గెట్ తో దిగిన ఈ సినిమా.. రూ. 4 కోట్ల షేర్, రూ. 8.15 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా క్లీన్ హిట్ గా నిల‌వాలంటే ఇంకా రూ. 12 కోట్ల షేర్ ను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.

Share post:

Latest