చిత్ర పరిశ్రమ అంటేనే ఓ మాయా లోకం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. దీనికి ఉదహరణంగా ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. స్టార్ హీరోలగా ఉన్నా వారు జీరోలుగా మరడం వంటివి క్షణాల్లో జరిగిపోతూ ఉంటుంది. ఓవర్ నైట్ లో సినిమా ఇండస్ట్రీలో తలరాత మార్చేసుకొని అడ్రెస్ లేకుండా పోయిన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. కాగా మళ్లీ అదే పరిస్థితి ఇప్పుడు చిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోయిన్లకు ఎదరు కాబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియలో వైరల్ అవుతుంది.
ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మల సినిమా వస్తుందంటేనే ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసేవారు.. అదేవిధంగా ఆ సినిమాలకు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు కూడా వచ్చేవి.. ఇప్పుడు మరి ఆ హీరోయిన్ల సినిమాలులే అట్టర్ ప్లాప్ సినిమాలు గా మిగిలిపోతున్నాయి.. దానికి కారణం చిత్రపరిశ్రమకు రోజుకు అందమైన హీరోయిన్లు వస్తున్నారు.. ఆ హీరోయిన్ల అందానికి ప్రేక్షకుడు ఫిదా అవుతున్నారు.
చిత్ర పరిశ్రమకు కొత్తగా వస్తున్న ముద్దుగుమ్మ లిస్టు చాలానే ఉంది. ఈ క్రమంలోని ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఉన్న సమంత, పూజా హెగ్డే, రష్మికలా జోరు ప్రస్తుతం తగ్గింది అని అంటున్నారు. ఒకవేళ ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఈ ముద్దుగుమ్మలు ఎంత చూపించినా జనాలు పట్టించుకునే వారు ఉండరు అంటూ జోష్యం కూడా చెప్తున్నారు. ఇక మరీ ఈ హీరోయిన్ల కెరియర్ ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.