స్కిన్ షోతో స‌మ్మ‌ర్ హీట్ మ‌రింత పెంచేసిన ర‌కుల్‌.. బాబోయ్ త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే!

టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

తెలుగులో ఆఫర్లు వస్తున్నా సరే.. వాటిని పక్కన పెట్టి మరీ బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. గత ఏడాది ఏకంగా ఐదు చిత్రాలతో అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకుంది.

కానీ ఆమెకు నిరాశే ఎదురయింది. అయితే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం రకుల్ ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తోంది.

అలాగే అవార్డు ఫంక్షన్స్‌, సినీ ఫంక్షన్లకు హాజరవుతూ తనదైన అందంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా వైట్ కలర్ ఓపెన్ షోల్డర్ డ్రెస్ లో స్కిన్ షో చేసి సమ్మర్ హీట్ పెంచేసింది.

టాప్ టు బాటమ్ పరవాల ప్రదర్శనతో హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అందాల విందుతో కుర్రాళ్లకు ఫుల్ మీల్స్ పెట్టేసింది.

రకుల్ తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రకుల్ గ్లామర్ మెరుపులకు నెటిజన్లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.

కాగా, సినిమాల విషయానికి వస్తే కోలీవుడ్ లో కమల్ హాసన్ కు జోడిగా `ఇండియన్ 2`, శివ కార్తికేయన్ తో `ఆయలాన్` చిత్రాల్లో నటిస్తోంది. అలాగే పలు బాలీవుడ్ ప్రాజెక్టులకు సైతం కమిట్ అయింది.

Share post:

Latest