రష్మిక పై నోట్ షేర్ చేసిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్..!!

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో పేరు సంపాదించింది హీరోయిన్ రష్మిక. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెలో నటిస్తోంది. అయితే ఇటీవల తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మరొక హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ శ్రీవల్లి పాత్ర గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పుష్ప సినిమాలో రష్మిక నటించిన శ్రీవల్లి పాత్ర తనకు బాగా నచ్చిందని ఆ పాత్ర తనకు వచ్చి ఉంటే బాగుందని ఆ పాత్రకు సరిగ్గా సెట్ అవుతానని తెలిపింది ఐశ్వర్య రాజేష్. దీంతో సోషల్ మీడియాలో ఈమె చేసిన కామెంట్లు తెగ వైరల్ గా మారాయి.

Aishwarya Rajesh clarifies comment on Rashmika: My statement was  misconstrued - Hindustan Times
దీంతో పలువురు నెటిజెన్లు సైతం రష్మిక కంటే తాను ఇంకా బాగా నటించేదాన్ని అంటూ చెప్పినట్టుగా పరు రూమర్లు సైతం సృష్టించారు.. దీంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం పెను దుమారాన్ని రేపేలా కనిపిస్తున్నాయి తాను చేసిన కామెంట్ల పైన వివరిస్తూ ఒక లేఖను కూడా రాయడం జరిగింది హీరోయిన్ ఐశ్వర్య.. ఆలేఖలో తన మాటలను తప్పుగా తీసుకున్నారని రష్మికను కించపరుస్తూ నేను అసలు మాట్లాడలేదంటూ క్లారిటీ ఇచ్చింది..

ఇటీవల తను తెలుగులో నటించిన సినిమాలలో ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారని ఒక ఇంటర్వ్యూలో అడిగారని అందుకు నేను మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమ అంటే తనకు చాలా ఇష్టమని అవకాశాలు వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నానని పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర తనకు బాగా నచ్చిందని ఆ పాత్రకు నేను సరిగ్గా సెట్ అవుతాను అంటూ తెలిపింది ఐశ్వర్య రాజేష్. కానీ తన మాటలను మాత్రం రష్మి కాని కించపరిచేలా మాట్లాడినట్లు రూమర్లు సృష్టించారని.. రష్మిక నటన పైన ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదని .. తన తోటి నటులందరి పైన తనకు చాలా ప్రేమ ఉందని తెలిపింది. దయచేసి ఇలాంటి వార్తలను స్ప్రెడ్ చేయకండి అంటూ రిక్వెస్ట్ చేస్తోంది ఐశ్వర్య రాజేష్.