విజయ్ దళపతి రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!!

తమిళంలో స్టార్ హీరో విజయ్ దళపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. కోలీవుడ్ లోనే అగ్ర హీరోగా పేరుపొందిన విజయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తమిళ్ సినిమాలు ఎన్నో డబ్ చేసి విడుదల చేసి మంచి విజయాలను అందుకున్నారు. తాజాగా విజయ్ దళపతి నటిస్తున్న లియో సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు . ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపుగా 17 ఏళ్ల తర్వాత త్రిష విజయ్ కాంబినేషన్లో ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది.

Thalapathy Vijay is now officially on Instagram - Telangana Today
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ఈ సినిమా హైపును మరింత పెంచేస్తూ ఉన్నాయి. ఈ సినిమా అయిపోయిన వెంటనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన ఫుల్ ఫోకస్ పెట్టారు విజయ్.. ఈ క్రమంలోనే ఆయన కొత్త సినిమా గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. డైరెక్టర్ వెంకట ప్రభు తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా రూ.150 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది సౌత్ లోని ఇంత మొత్తంలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోగా విజయ్ దళపతి కి మాత్రమే అందుతోందని చెప్పవచ్చు.

ఈ సినిమా లాభాలలో కూడా విజయకు మేజర్ షేర్ వస్తుందని ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో డైరెక్టర్ ప్రభు ప్రొడక్షన్ హౌస్ ags ఎంటర్టైన్మెంట్ భాగస్వామ్యం ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఒకేసారి విజయ్ దళపతి ఎన్ని కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి తన చిత్రాలన్నీ పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్నారేమో చూడాలి మరి.

Share post:

Latest