గత ఏడాది కాలం నుంచి వరుస ఫ్లాపులతో నలిగిపోతున్న టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. ఒక్క హిట్ కోసం పరితపించిపోతోంది. రాధేశ్యామ్ రిలీజ్‌కు ముందు వరకు కెరీర్ పరంగా మంచి ఫామ్‌లో ఉన్నా.. ఆ తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ మహేష్ బాబుకు జోడీగా `ఎస్ఎస్ఎమ్‌బీ 28`లో నటిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో శ్రీలీల మరో హీరోయిన్ గా నటిస్తోంది.
అలాగే ఇటీవల బాలీవుడ్ లో పూజా హెగ్డే మరో ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. `కోయి షా` అనే టైటిల్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
ఇకపోతే పూజా హెగ్డే తాజా ఫోటోషూట్ నెటిజన్లను బాగా ఎట్రాక్ట్ చేసింది. గ్లామర్ షో విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోని పూజా.. తాజాగా తన అందాలతో మరోసారి కుర్రకారు మతులు చెడగొట్టింది.
బ్లాక్ శారీలో నాజూకు నడుమును చూపిస్తూ హీట్ పెంచేసింది. కిర్రాక్ ఫోజులతో చూపు చూపుకోకుండా చేసింది.
ఈమె తాజా ఫోటోలు చూసి బుట్టబొమ్మ బాగా తెగించేసింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.