పుష్ప-2 చిత్రంలో శ్రీవల్లిని లేపేసారా.. వైరల్ గా మారిన ఫోటో..!!

పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో గా మారారు.. ప్రస్తుతం పుష్ప-2 కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడుతున్నారు. డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్,ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా బాగా వైరల్ గా మారాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు రేకేతెల చేశాయి.. ఈ చిత్రంలో రష్మిక శ్రీవల్లి పాత్రలో అద్భుతంగా నటించింది.

Rashmika Mandanna Words On Pushpa 2 Are Making Our Wait Harder!

డీ గ్లామరస్ పాత్రలో అద్భుతంగా నటించిన రష్మిక ఆకట్టుకునే నటనతో డాన్స్ తో అందరిని మెస్మరైజ్ చేసింది. తాజాగా పుష్ప-2 సినిమా షూటింగ్ మారేడుమిల్లి అడవులలో షూటింగ్ జరుపుకుంటోంది. రెండు రోజుల క్రితం నటుడు ఫహద్ ఫాజిల్ సన్నివేశాలు కూడా పూర్తి అయినట్టు డైరెక్టర్ సుకుమార్ తెలియజేశారు. ఇక ఈ సినిమా నుండి ఎలాంటి వీడియోలు సన్నివేశాలు కూడా లీక్ కాకూడదని చిత్ర బృంద చాలా పగడ్బందీగా ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ తాజాగా రష్మిక కి సంబంధించి ఒక పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Fact Check: Not Rashmika And Not From Pushpa 2!

ఆమె ఇందులో చనిపోయినట్టుగా ఈ ఫోటో షేర్ చేస్తూ పుష్పటూలు రష్మిక పాత్ర చనిపోతున్నట్లు చెప్పుకొస్తున్నారు. మొదటినుంచి కూడా పుష్ప-2 చిత్రంలో రష్మిక పాత్ర చనిపోతుందని కొత్త హీరోయిన్ ఉంటుందంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను క్లారిటీ ఇచ్చిన ఈ ఫోటోని అందుకు సాక్ష్యం అంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక పలు చిత్రాలలో కూడా నటిస్తోంది.

Share post:

Latest