టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించారు. తన తదుపరిచిత్రం డైరెక్టర్ కొరటాల శివతో తెరకెక్కిస్తూ ఉన్నారుఎన్టీఆర్.ఈరోజున ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పలువురు అభిమానులు సినీ ప్రముఖుల సైతం ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. NTR -30 వ చిత్రానికి దేవర అనే టైటిల్ని కూడా రివిల్ చేయడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలలో ఒక నెలరోజుల పాటు జరిగింది.రెండవ షెడ్యూల్ ని ఇప్పుడే మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.
మొదటి షెడ్యూల్లోని కొన్ని సన్నివేశాలు మరియు రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ఒక రైల్వే స్టేషన్ సెట్ లో సైఫ్ అలీ ఖాన్ మరియు ఎన్టీఆర్ మద్య పోరాట సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం.ఈ షెడ్యూల్లో జాన్వీ కపూర్ కూడా పాల్గొనింది.ఎన్టీఆర్ పుట్టినరోజుకి ముందుగానే ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని కూడా విడుదల చేయడం జరిగింది.. కళ్యాణ్ రామ్ తన ట్విట్టర్ నుంచి దేవర అని టైటిల్ తో ఫిక్స్ చేసినట్టుగా పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ టైటిల్ పైన కాస్త గొడవ మొదలైందని వార్తలు వినిపిస్తున్నాయి..
ట్విట్టర్లో బండ్ల గణేష్ ఒక ట్వీట్ వేస్తూ.. ఇది నేను రాబోయే రోజుల్లో సినిమా తీసేందుకు రిజిస్టర్ చేయించుకున్న టైటిల్.. నేను మర్చిపోయే లోపు నా నుండి దొబ్బేశారు అంటూ ఒక ట్వీట్ చేశారు.. ఈ ట్వీట్ పై అభిమానులు పలు రకాలుగా రియాక్షన్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ని ఎక్కువగా దేవర అని పిలుస్తూ ఉంటాడు బండ్ల గణేష్.ఆయనతో తీయబోయే సినిమా కోసమే ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా సమాచారం.ఇటీవల పవన్ కళ్యాణ్ పైన కూడా పలు సెటైర్లు కూడా వేస్తూ ఉన్నారు.
నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్ ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా ఆయన కూడా నాకు దేవరే ❤️ https://t.co/Ad1wIqIfYB
— BANDLA GANESH. (@ganeshbandla) May 19, 2023