రాధిక- శ్రీదేవి మధ్య అంత పెద్ద గొడవ జరిగిందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు.. ప్రతి ఒక్కరు కూడా తమ నటనతో అందంతో ఎంతోమందిని ఆకట్టుకున్నారు. అలాంటివారిలో హీరోయిన్ శ్రీదేవి కూడా ఒకరు. మొదట చైల్డ్ యాక్టర్ గా తన సినీ కెరియర్ను మొదలుపెట్టి దాదాపుగా కొన్ని వందల చిత్రాలలో నటించింది. బాలీవుడ్ చిత్రాలలో కూడా ఈమె నటించి తనదైన ముద్ర వేసుకుంది.. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అభిమానులు కొన్ని లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారని చెప్పవచ్చు.

తెలుగు సినీ పరిశ్రమలో శ్రీదేవితో పాటు చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. అలాంటి వారిలో జయప్రద , భానుప్రియ, సుహాసిని రాధ తదితర హీరోహిన్స్ సైతం ఉన్నారు బాలీవుడ్ లో కూడా నటించినప్పటికీ అందరూ ఆమెతో పాటు ఎదగలేకపోయారు. శ్రీదేవి సోలో హీరోయిన్ గానే కాకుండా ఇతర హీరోయిన్స్ తో కూడా కలిసి నటించింది. కృష్ణ ,శోభన్ బాబు ,ఏఎన్నార్ తదితర నటులతో శ్రీదేవి బాగా ఎక్కువ సినిమాలలో నటించింది. అయితే హీరోయిన్ రాధికా తో శ్రీదేవి కలిసి నటించిన చిత్రాలు కూడా ఉన్నాయి.

NTR, Krishna, Sridevi, Radhika Blockbuster Movie Scenes HD Part 9 | Telugu  Superhit Movie Scenes - YouTube

జయప్రద తోనే శ్రీదేవికి ఇండస్ట్రీలో విభేదాలు ఉండేవని అప్పట్లో ఎక్కువగా వార్తలు వినిపించాయి. కానీ రాధిక లాంటి ఒక ఫైర్ బ్రాండ్ హీరోయిన్ తో కలిసి నటించినప్పుడు కూడా గొడవలు జరిగాయని సమాచారం.ఇద్దరు ఎదురెదురుగా ఉన్నప్పుడు ఏ ఒక్కరిని కూడా అనుకునేవారు కాదట..కేవలం కలిసి ఉండడమే కాకుండా పలు రకాల షాపింగ్ కూడా చేసేవారట. కానీ ఒకసారి తమిళ సినిమాలో నటిస్తున్న సమయంలో రాధిక ,శ్రీదేవి కలిసి నటించారు .శ్రీదేవితో సమానంగా రెమ్యూనరేషన్ కావాలంటూ రాధిక డిమాండ్ చేయడంతో అక్కడ పెద్ద వివాదానికి దారితీసిందట.. దీంతో గొడవ పెద్దదవుతుంది అని తెలిసి నిర్మాత శ్రీదేవిని రెమ్యూనరేషన్ కాస్త తగ్గించుకోమని కోరాడట.. కానీ ఆమె ఒప్పుకోకపోవడంతో వీరీద్దరి మధ్య గొడవ పెద్దదవుతుంది అని తెలిసి నిర్మాత రాధికను తీసేసి సరిత హీరోయిన్గా తీసుకురావడం జరిగిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Share post:

Latest