కొంప‌ముంచిన `రామ‌బాణం`.. గోపీచంద్ సంచ‌ల‌న నిర్ణ‌యం!

గత కొన్నేళ్ల నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో సతమతం అవుతున్న టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్.. `రామబాణం`తో స‌క్సెస్‌ ట్రాక్ ఎక్కాలని ఎంతగానో ఆశపెట్టాడు. కానీ ఆయనకు నిరాశే ఎదురైంది. శ్రీ‌వాస్ దర్శకత్వం వ‌హించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ లో గోపీచంద్, డింపుల్ హ‌యాతి జంట‌గా న‌టించారు.

జ‌గ‌ప‌తి బాబు, ఖుష్బూ, నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అయితే మే 5న భారీ అంచ‌నాల న‌డుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. తొలి ఆట నుంచి నెగటివ్ టాక్ ను మూట‌గ‌ట్టుకుని బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడింది. ఇక రామబానం పరాజయం గోపీచంద్ కొంపముంచింది. ఈ సినిమా వ‌ల్ల ఆయ‌న‌ ఇమేజ్ తో పాటు మార్కెట్ కూడా మ‌రింత ప‌డింది.

దీంతో గోపీచంద్ సంచల నిర్ణయం తీసుకున్నాడు. తాను తీసుకుంటున్న రెమ్యునరేషన్ లో సగం తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యాడ‌ట‌. త‌న‌కు స‌న్నిహితంగా ఉండే నిర్మాత‌ల సూచ‌న మేర‌కు గోపీచంద్ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌. మంచి హిట్ ప‌డే వరకు రెమ్యునరేషన్ తగ్గించుకుంటే మంచిది అని.. హిట్స్ వస్తే ఆ తర్వాత నిర్మాతలే ఎక్కువ మొత్తం ఇస్తారని గోపీచంద్ భావిస్తున్నార‌ట‌.

Share post:

Latest