జగ్గూభాయ్‌ హెల్త్‌ సీక్రెట్ లీక్‌.. రోజు ఏం తింటారో తెలిస్తే షాకే!

జ‌గ‌ప‌తిబాబు గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హీరోగా ఓ వెలుగు వెలిగిన జ‌గ‌ప‌తిబాబు.. ప్ర‌స్తుతం విల‌న్ గా దూసుకుపోతున్నాడు. అలాగే స్పెష‌ల్ రోల్స్ లో కూడా న‌టిస్తూ.. ది మోస్ట్‌ బిజియెస్ట్‌ యాక్టర్లలో ఒక‌రిగా నిలిచారు. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ స‌త్తా చాటుతున్న మ‌న జ‌గ్గూబాయ్‌.. ఆరు ప‌దుల వ‌య‌సులోనూ ఎంతో ఫిట్‌గా, హెల్తీగా క‌నిపిస్తుంటారు.

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలోకి కూడా అడుగు పెట్టిన ఆయ‌న‌.. త‌ర‌చూ ఏదో ఒక పోస్ట్ తో అభిమానుల‌కు చేర‌వవుతున్నారు. తాజాగా త‌న హెల్త్ సీక్రెట్ ను లీక్ చేశారు. ఆవకాయ పచ్చడితో అన్నం తింటోన్న ఫొటోను షేర్‌ చేస్తూ `ఏ దేశం వెళ్లినా.. సద్దన్నంలో ఆవకాయ పచ్చడి కలుపుకొని తింటే ఆ మజానే వేరు. మా అత్తగారు ఇచ్చిన ఆవపిండి కలిపిన ఆవకాయ పచ్చడి పొద్దునే కలుపుకొని తింటున్నా` అని పోస్ట్ పెట్టారు.

జ‌గ్గూభాయ్ పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నిజానికి జ‌గ‌ప‌తి బాబు కోట్ల‌కు అధిప‌తి. అలాంటి ఆయ‌న రోజు ఉద‌యం స‌ద్ద‌నంతో ఆవ‌కాయ క‌లుపుకుని తింటారంటే నిజంగా ఆశ్చ‌ర్య‌మే. ఇక జ‌గ‌ప‌తి బాబు పెట్టిన పోస్ట్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా, రీసెంట్ గా ఈయ‌న `రామ‌బాణం` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. గోపీచంద్ కు అన్న‌గా ఇందులో న‌టించారు. అయితే ఈ సినిమా ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది.

https://www.instagram.com/p/CsB5RxEpJlP/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

Share post:

Latest