`క‌స్ట‌డీ`కి పెద్ద మైన‌స్‌లు ఇవే.. నాగ‌చైత‌న్యకి మ‌ళ్లీ నిరాశేనా?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం `క‌స్ట‌డీ`. ఇందులో అర‌వింద్ స్వామి విల‌న్ గా నటించాడు. ప్రియమణి, శరత్ బాబు తదితరులు కీలకపాత్రల‌ను పోషించారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు అట్టహాసంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన సినీ ప్రియలు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఒక సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ గురించి సాగే కథతో ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో చైతు లుక్, క్యారెక్టర్ కొత్తగా ఉంటాయి. కృతి శెట్టి కూడా రా అండ్ రస్టిక్ పాత్ర‌ను పోషించింది. అలాగే విల‌న్ గా అర‌వింద్ స్వామి అద‌ర‌గొట్టేశాడు. కానీ, సినిమాకు ఆహో, ఓహో అనే టాక్ అయితే లేదు. సినిమా చూసిన వారిలో చాలా మంది ఫ‌స్టాఫ్ ఏ మాత్రం ఆక‌ట్టుకునే విధంగా ఉండ‌ద‌ని.. ఫస్టాఫ్‌లో కంటెంట్ 15 నిమిషాలే ఉంటుందని చెబుతున్నారు.

ప్రీ ఇంటర్వెల్ నుంచి కథపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్, సెకండాఫ్ లో వ‌చ్చే ట్విస్టులు ఆక‌ట్టుకున్నాయి. అయితే ద‌ర్శకుడు వెంకట్ ప్రభు ఇంటర్వెల్ నుంచి కథపై కాస్త ఆసక్తి కలిగించగలిగారు కానీ.. ఎంగేజ్ చేసేలా స్క్రీన్ ప్లే రాసుకోక‌పోవ‌డం పెద్ద మైన‌స్‌. యువ‌న్ శంక‌ర్ రాజా, ఇళ‌య‌రాజా అందించిన నేప‌థ్య సంగీతం బాగున్నా.. సినిమాలో పాట‌లు తీవ్రంగా నిరాశ‌ప‌రిచాయి. అనవసరంగా వచ్చే సాంగ్స్ ఫ్లోను తగ్గించాయి. అలాగే హీరో, హీరోయిన్ల ప్రేమ‌క‌థ ఏ మాత్రం ఆస‌క్తిగా ఉండ‌దు. రిపీటెడ్‌ యాక్షన్ సీక్వెన్స్‌లు కాస్త విసిగిస్తాయి. ఎప్పుడూ కథతో, స్క్రీన్ ప్లే తో కట్టిపడేసే వెంకట్ ప్రభు ఈసారి నిరాశపరిచారు. మొత్తానికి క‌స్డ‌డీకి మిక్స్డ్ టాక్ ల‌భించింది. దీంతో నాగ‌చైత‌న్య‌కి మ‌ళ్లీ నిరాశే మిగులుతుంద‌ని చ‌ర్చించుకుంటున్నారు.