హీరోయిన్స్ పై చైతు షాకింగ్ కామెంట్స్..!!

అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయి దాదాపుగా ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావస్తోంది.. అయినా ఇప్పటికి వీరిద్దరికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటాయి. తాజాగా నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మరొకసారి సమంతకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక వీరి వ్యక్తిగత జీవితం పెళ్లి విడాకుల వ్యవహారం గురించి మరొకసారి ఓపెన్ గా మాట్లాడారు చైతన్య.. తనకు సమంతకు డివర్స్ అయిపోయాయని ఇంకా ఎందుకు వాటి గురించి చర్చ నడుస్తోంది అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు.

Naga Chaitanya wanted to Marry Shruti Haasan and NOT Samantha?
అలాగే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్స్ విషయంలో పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.. మొదట సమంత గురించి మాట్లాడుతూ ఆమె ఏదైనా అనుకుంటే తప్పకుండా చేసి తీరుతుందని ఆమె సంకల్పం చాలా గొప్పది అంటూ తెలియజేశారు. ఇక మరొక హీరోయిన్ పూజా హెగ్డే మాట్లాడుతూ ఆమె స్టైల్ అంటే చాలా ఇష్టం అంటూ పొగిడేశారు.. కృతి శెట్టి విషయానికి వస్తే ఆమె అమాయకత్వం చూడముచ్చటగా ఉంటుందని అద్భుతమైన చిత్రాలలో నటించాలని తపన తనలో ఉంది అంటూ తెలిపారు.

Krithi Shetty unbelievable comment on Sai Pallavi
సాయి పల్లవి విషయానికి వస్తే డాన్స్ బాగుంటుంది ఆమె ఉండడం వల్లే లవ్ స్టోరీ సినిమాలో డాన్స్ కోసం ఎక్కువగా రిహార్సల్ చేశామంటూ తెలిపారు.శృతిహాసన్ గురించి మాట్లాడుతూ శృతిహాసన్ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ ఆమె పాటలు చాలా నచ్చుతాయి ఇక సమంత హార్డ్ వర్కర్ పరిస్థితులు ఎలా ఉన్న దృఢ సంకల్పంతో ముందుకు వెళుతుంది అంటూ తెలిపారు. సమంత నటించిన చిత్రాలలో మజిలీ తరువాత ఓ బేబీ సినిమా తనకు చాలా నచ్చింది అంటూ తెలిపారు. ఇటీవల యశోద సినిమాను కూడా చూశానని తెలిపారు.

Share post:

Latest