వామ్మో.. ఈ టాలీవుడ్ స్టార్ హీరోలను గుర్తుపట్టారా..!!

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో స్టార్ హీరోలకు సంబంధించి పలు రకాల ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.. గతంలో రాముడు సీత ఇలా ఉండేవారు అంటూ కొన్ని ఆర్టిఫిషియల్ ఫోటోలు కూడా తెగ వైరల్ గా మారాయి. ఇక ఇటీవల జిమ్ములో కొసరత్తులు చేస్తున్న కొంతమంది ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. తాజాగా ఇండియన్ ఫిలిమ్స్ సెలబ్రిటీస్ ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానుల సైతం ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు.

Viral Post | Our heroes look like this when they age.. AI images going  viral..!-

మన స్టార్ హీరోలు వృద్ధులుగా మారిపోతే ఎలా కనిపిస్తారు అన్నట్టుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. AI ఆర్టిస్ట్ ఎస్ కె ఎండి అబుసాహిద్ స్టార్ హీరోలను వృద్ధులుగా మార్చడానికి మీ జర్నీని ఉపయోగించారట. మీ హీరోలను ఏఐ ముసలి వాళ్లు గా ఊహించుకోండి అంటూ ఒక క్యాప్షన్ కూడా రాయడం జరిగింది అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలలో ప్రభాస్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ తప్ప మిగిలిన హీరోలంతా పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు.

దీంతో పలువురు అభిమానులు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది టెక్నాలజీ పూర్తిగా మార్చేసింది అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో అమీర్ ఖాన్, అల్లు అర్జున్, హృతిక్ రోషన్, షారుక్ ఖాన్, రణబీర్ కపూర్ మహేష్ బాబు, సల్మాన్ ఖాన్,ప్రభాస్ వంటి హీరోలు ముసలి వాళ్లు అయితే ఎలా ఉంటారు అనే విషయాన్ని ఈ ఫోటోల ద్వారా తెలియజేశారు సాహిద్. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి..

 

View this post on Instagram

 

A post shared by SAHID (@sahixd)

Share post:

Latest