టీడీపీ-జనసేన సరే..బీజేపీ కలుస్తుందా?

ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు ఖాయమైపోయినట్లే…అందులో ఎలాంటి డౌట్ లేదు. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి..వైసీపీకి లాభం జరిగింది. కానీ ఈ సారి ఎన్నికల్లో ఆ పరిస్తితి రానివ్వకూడదు అని చెప్పి..రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతున్నాయి. ఈ క్రమంలోనే పలుమార్లు చంద్రబాబు, పవన్ కూడా భేటీ అయ్యారు. ఇక తాజాగా పవన్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. పొత్తులు ఖచ్చితంగా ఉంటాయని, గౌరవప్రదమైన పొత్తు ఉంటుందని, వైసీపీని గద్దె దించడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు.

దీని బట్టి చూస్తే టి‌డి‌పి-జనసేన పొత్తు ఖాయమని తేలిపోయింది. కానీ వీరితో బి‌జే‌పి కలుస్తుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. వాస్తవానికి ఇప్పుడు జనసేన-బి‌జే‌పి కలిసి ఉన్నాయి. ఈ క్రమంలో జనసేన..బి‌జే‌పిని కూడా కలుపుకుని టి‌డి‌పితో పొత్తు పెట్టుకోవాలని చూస్తుంది. కానీ బి‌జే‌పి ఏమో టి‌డి‌పితో పొత్తుకు ఒప్పుకోవడం లేదు. అటు టి‌డి‌పి శ్రేణులు సైతం బి‌జే‌పితో పొత్తు అనవసరం అని అనుకుంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో బి‌జే‌పికి ఏ మాత్రం బలం లేదు.

 

బి‌జే‌పికి ఓటు బ్యాంక్ కూడా సరిగా లేదు..ఈ నేపథ్యంలో టి‌డి‌పి-జనసేనలతో బి‌జే‌పి కలుస్తుందా? లేదా? అనేది చెప్పలేని పరిస్తితి. అయితే కేంద్రం పెద్దల చేతుల్లోనే పొత్తుల అంశం ఉంది. వారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఊహించడానికి లేదు. రాష్ట్రంలో వైసీపీకి కాస్త ఎడ్జ్ ఉందని అనుకుంటే..ఆ పార్టీకి పరోక్షంగా సహకరించే అవకాశం ఉంది.

అలా కాకుండా టి‌డి‌పి-జనసేనకు మొగ్గు ఉంటే..ఆ పార్టీల వైపు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. అదే సమయంలో కర్ణాటకలో వచ్చే ఎన్నికల ఫలితాల బట్టి బి‌జే‌పి ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. చూడాలి మరి బి‌జే‌పి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.