ఆ టాప్ హీరోల సినిమాలు మధ్యలో ఇన్ని ఆగిపోయాయా..?!

ఒక సినిమా తీయాలంటే ఎంతమంది కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక నిర్మాతలు అయితే డబ్బుల విషయంలో నానా కష్టాలు పడాలి. పొరపాటున సినిమా రిలీజ్ అవడం లేటైనా, ఆగిపోయినా నిర్మాతలు దెబ్బ తినడం ఖాయం. కొంతమంది నిర్మాతలు అలాంటి సంఘటనలను తట్టుకోలేరు. ఇలా మధ్యలో ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవిని హీరోగా తీసుకొని వినాలని ఉంది అనే సినిమా తియ్యాలనుకున్నారు. ఈ సినిమాని అశ్విని దత్ నిర్మించారు. కానీ డైరెక్షన్ లో చిరు వేలు పెట్టడంతో రాంగోపాల్ వర్మ కోపంతో మధ్యలోనే ఆపేసాడు. దాంతో సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇక చిరంజీవితో హిందీ, తెలుగు, తమిళం, మలయాళం ఇలా అన్ని భాషలో అబు బాగ్దార్ ‘ గజదొంగ ‘ అనే టైటిల్ తో సినిమా తియ్యాలనుకున్నారు. ఈ సినిమా కూడా కొంత షూటింగ్ అయ్యాక మధ్యలోనే ఆగిపోయింది.

మరో స్టార్ హీరో బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ గా సెట్స్ వేసి మొదలు పెట్టిన నర్థనశాల సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. ధ్రౌపతి పాత్రలో నటించాల్సిన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం తో ఈ సినిమా ని మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తరువాత కోడి రామకృష్ణ దర్శకత్వం లో ఎస్ గోపాల్ రెడ్డి నిర్మాత్తగా తీసిన ‘విక్రమ సింహ భూపతి ‘ సినిమా లో బాలకృష్ణ నటించాడు. కోట్ల రూపాయలతో తెరకేక్కించిన ఈ సినిమా కోడి రామకృష్ణ కి బాలయ్య కి మధ్య విబేధాలు రావడం తో మధ్యలోనే ఆగిపోయింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని హీరోగా తీసుకొని ఏ ఏం రత్నం డైరెక్షన్ లో తెరకేక్కించాలనుకున్న సత్యాగ్రహీ సినిమా కూడా మధ్యలోనే ఆపేసారు. సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో భారీ చిత్రాలను నిర్మించిన కొండ కృష్ణంరాజు తన బ్యానర్ లో పవన్ కళ్యాణ్ ని యేస్తూ క్రీస్తుగా నటించేలా ఒప్పించి షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాకి ‘పీస్ ఆఫ్ పీస్’ అనే ఇంగ్లీష్ టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఎందుకో తెలియదు కానీ ఈ సినిమా కూడా మధ్యలో ఆగిపోయింది. అలానే బాలీవుడ్ బాలీవుడ్ హిట్ మూవీ ఉదయ్ కిరణ్ హీరోగా మొదలై ఆగిపోయింది. అలానే సుమన్, కోడి రామకృష్ణ కాంబినేషన్ లో రిలీజ్ కావాల్సిన చాలా సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి.