నాగచైతన్య చివరిగా నటించిన చిత్రం థాంక్యూ. ఈ సినిమా భారీ డిజాస్టర్ ని మూట కట్టుకుంది. దీంతో తన తదుపరిచిత్రం ఎలాగైనా సక్సెస్ సాధించాలని ఆలోచనతో బైలింగ్వెల్ మూవీని చేశారు.ఆ చిత్రమే కస్టడీ.. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో ఈ రోజున విడుదల అయింది. డైరెక్టర్ వెంకటప్రభు ఈ సినిమాని యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కించారు. ఇందులో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. హీరోయిన్గా కృతి శెట్టి నటించగా విలన్గా అరవింద స్వామి కీలకమైన పాత్రలో ప్రియమణి కూడా నటిచింది. మరి ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం.
కస్టడీ సినిమా ప్రమోషన్స్ లోనే నాగచైతన్య చాలా డిఫరెంట్గా ప్రేక్షకులను ఆకర్షించారు. ముఖ్యంగా ఆయన క్యారెక్టర్ కొంచెం విభిన్నంగా కనిపించాయి. సోషల్ మీడియాలో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. మెజార్టీ ఆడియన్స్ ఈ సినిమా బాగుందని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా నాగచైతన్య, అరవింద స్వామి నటన చాలా అద్భుతంగా ఉందని కృతి శెట్టి సైతం తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసిందని.. ప్రియమణి కూడా తన పాత్రకు అద్భుతంగా నటించిందని తెలియజేస్తున్నారు.
Now that’s a first half! Thoroughly enjoying #Custody ‘a storytelling so far!
VP is hitting the right mix of action, comedy, and a sense of world building. No character is wasted for sense and every scene is necessary. One shot fight 👌
NC is holding his own while YSR’s BGM 🔥 pic.twitter.com/4SeZIznhCA
— Sai_Reviews (@saisaysmovies) May 12, 2023
కస్టడీ చిత్రం చాలా నెమ్మదిగా సాగుతుందని ఇంటర్వెల్ వరకు డైరెక్టర్ ఈ సినిమాను రొటీన్ సినిమాల లాగా చేశారు. ఇంటర్వెల్ తర్వాత ఈ సినిమా హైలైట్ గా ఉంటుందని తెలుపుతున్నారు.
Good First half 👌
Venkat Prabhu Mark Fun and Thrills 👌 #Custody https://t.co/R9xgNsQ5oB
— Srinivas #SSMB28 (@SrinivasSSMB) May 11, 2023
అయితే ఈ సినిమాకు కేవలం సాంగ్స్ మాత్రమే మైనస్ అన్నట్లుగా వినిపిస్తోంది. ఇక టెక్నికల్ పరంగా ఎడిటింగ్ సినిమాటోగ్రఫీ బాగుందని .. వెన్నెల కిషోర్ కామెడీ సైతం ప్రేక్షకులను నేర్పిస్తోందని తెలియజేస్తున్నారు మరి ఏ మేరకు ఈ సినిమా ఆకట్టుకుంటుందో చూడాలి.
#BlockbusterCustody#Custody@chay_akkineni @vp_offl https://t.co/wO9GWviQkT
— #Custody #Dhootha (@nagfans) May 11, 2023