“మళ్ళీ పెళ్లి” ట్రైలర్ టాక్ : అయ్యయ్యో ఫ్లోలో టంగ్ స్లిప్ అయ్యాడే.. నరేష్ ఆ విషయాని బయటపెట్టేసాడే..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా నరేష్ – పవిత్ర లోకేష్ జంటగా నటించిన “మళ్లీ పెళ్లి” ట్రైలర్ గురించి చర్చించుకుంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా ఈ ట్రైలర్ లో నరేష్ పవిత్రల మధ్య ఎలా ప్రేమ చిగురించింది అన్న కాన్సెప్ట్ హైలైట్ గా మారింది . అంతేకాదు ఒక మనిషి జీవితంలో ఒకసారి ప్రేమ పుట్టి.. పెళ్లి చేసుకుని .. విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ప్రేమ పుడుతుందా ..? అనే కాన్సెప్ట్ డైరెక్టర్ – నిర్మాత ఎం ఎస్ రాజు చాలా చక్కగా చూపించారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి .

అంతేకాదు తెర వెనక నరేష్ జీవితంలో ఎలా జరిగిందో అదే విధంగా తెరపైన చూపించాడు అన్న విధంగా జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్రైలర్లో కొన్ని బూతు పదాలు ఉన్న అందరికీ నరేష్ పవిత్రల మధ్య బాండింగ్ ఎలా ఏర్పడింది అని తెలుసుకోవడం ఇంట్రెస్టింగ్ గా మారింది . ఈ క్రమంలోనే ట్రైలర్లో నరేష్ 1000 కోట్ల అందగాడు అన్న కామెంట్ ని జనాలు క్యాచ్ చేశారు .

నిజంగానే నరేష్ కి వెయ్యికోట్ల ఆస్తి ఉందా ..? అంటూ షాక్ అయిపోతున్నారు. జనాలు ఇప్పుడు అదే విషయాని చర్చించుకుంటున్నారు . మరి కొంతమంది ఉన్న ఆశ్చర్యపోనవసరం లేదు అమ్మ ఆస్తి మొత్తం నరేష్ తీసుకున్నాడు కదా అంటూ చెప్పుకొస్తున్నారు . ఫైనల్లీ “మళ్ళీ పెళ్లి” సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్టు తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు నరేష్ అన్నది ఫిక్స్ అయిపోయింది. మరి కొంతమంది ఈ సినిమా బాహుబలి రికార్డ్స్ ని బీట్ చేస్తుంది అంటూ ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు .

Share post:

Latest