టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు . ఆయన 40వ ఏట అడుగుపెట్టారు. గత నెల రోజులుగా ఎన్టీఆర్ బర్త్డే వేడుకలకు అభిమానులు ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి . కాగా గత అర్ధరాత్రి నుంచి ఆయన ఇంటి వద్ద భారీ స్థాయిలో హంగామా చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ . భారీ ఫ్లెక్సీలతో కటౌట్లతో ..కేక్ కటింగ్ చేస్తూ జై ఎన్టీఆర్ అంటూ రచ్చ రచ్చ చేశారు . కాగా పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు బర్త డే విషెస్ అందిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ ను మళ్ళీ ట్రెండింగ్లోకి తీసుకొస్తున్నారు . కాగా కేవలం ఫ్యాన్స్ నే కాదు చిత్ర ప్రముఖులు సన్నిహితులు సైతం ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే తారక్ కి ఎంతో ఫేవరెట్ హీరో అయినా అల్లు అర్జున్ ఆయనకు స్పెషల్గా విష్ చేశారు . బన్నీ తారక్ ల మధ్య ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. బావా బావా అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా విష్ చేస్తూ ‘నువ్వు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి బావా.. హోప్ యు హావ్ బ్లడీ గుడ్ బర్త్ డే’ అని అని తనదైన స్టైల్ లో ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలియజేశారు .
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ చేసిన పోస్ట్ అంతా బాగున్నప్పటికీ బ్లడీ గుడ్ బర్తడే అనేది జనాలు అర్థం కాలేదు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం జూనియర్ తారక్ కి ఓ పదం ఎక్కుగువగా వాడే అలవాటు ఉందట. అదే బ్లడీ ..అందుకే ఆయన స్టైల్ లోనే బన్నీ తారక్ కి విష్ చేశాడు అని చెప్పుకొస్తున్నారు ఎన్టీఆర్ – అల్లు అర్జున్ మ్యూచువల్ ఫ్యాన్స్ . అంతేకాదు బన్నీ పెట్టిన ట్వీట్ ని ట్రెండ్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో బన్నీ ఎన్టీఆర్ ల పేర్లు మరో రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయి . త్వరలోనే వీరిద్దరూ కలిసి తెరపై నటిస్తే చూడాలి అన్నది అభిమానుల కోరిక .. చూద్దాం మరి ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో..?
Many many happy returns of the day Bava @tarak9999 . Hope you have a ( bloody 😉 ) good birthday .
— Allu Arjun (@alluarjun) May 20, 2023