జూ ఎన్టీఆర్ బర్తడే స్పెషల్: ఫ్యాన్స్ అత్యుత్సాహం.. తారక్ కటౌట్ కి మేకపోతు బలి.. ఇదేం పిచ్చి రా బాబులు..!!

ఈ మధ్యకాలంలో కొందరు జనాలు అభిమానం అన్న పేరుతో ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో తెలియకుండా పోతుంది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ ఫ్యాన్స్ అంటూ చెప్పుకునే కొందరు అభిమానులు హద్దుల మీరి ప్రవర్తిస్తున్నారు . తమ హీరోని విష్ చేయకపోయినా బూతులు తిడుతున్నారు.. తమ హీరోతో సినిమాలో రిజెక్ట్ చేసిన హీరోయిన్ ని సోషల్ మీడియాలో ఏకీపారేస్తున్నారు.. మరి కొందరు ఏకంగా తమ హీరో సినిమా ఫ్లాప్ అయ్యి..పక్క చిన్న హీరో సినిమా హిట్ అయితే నెగిటివ్ టాక్ క్రియేట్ చేస్తున్నారు. ఇలా రీజన్ ఏదైనా కానీ అభిమానం అనేది హద్దులు మీరుతోంది అన్నది మాత్రం వాస్తవం .

కాగ రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కూసింత హద్దులు మిరారు అనే చెప్పాలి . నేడు తారక్ పుట్టినరోజు ..ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ఆయన కటౌట్ కి ఏకంగా మేకపోతు బలి ఇచ్చేశారు. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రచ్చ రంబోలా చేశారు . తారక్ పుట్టినరోజు సందర్భంగా మచిలీపట్నంలోని జీ3 థియేటర్లో సింహాద్రి సినిమాను ప్రదర్శించారు . సినిమా ప్రదర్శన సందర్భంగా థియేటర్ వద్ద అభిమానులు చాలా స్థాయిలో సందడి చేశారు .

అయితే ఈ క్రమంలోనే కొందరు ఫాన్స్ జూనియర్ ఎన్టీఆర్ కటౌట్ కు రెండు మేకపోతులను బలి ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు . అంతేకాదు మధ్యాహ్నం పేదలకు అన్నదానం నిర్వహించారు . అంతేనా జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు . ఈ క్రమంలోని మరికొందరు జూనియర్ ఎన్టీఆర్ జెండాలు కట్టుకొని బైక్ ర్యాలీ నిర్వహించారు . అయితే కొంతమంది జనాలు మాత్రం ఈ మేకపోతుల బలిని యాక్సెప్ట్ చేయడం లేదు .అన్నదానం – ర్యాలీ ఇంతవరకు ఓకే గాని మూగజీవులను బలిస్తే మీ ఎన్టీఆర్ సంతోషపడతారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు . ఏది ఏమైనా సరే మేకపోతులను బలివ్వడం తప్పే అంటున్నారు కొందరు జనాలు .దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

 

 

Share post:

Latest