జూనియర్ ఎన్టీఆర్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ మూవీస్ ఇవే..!!

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎవరితో ఎలా ఉండాలో జూనియర్ ఎన్టీఆర్ కు బాగా వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఆది, సింహాద్రి వంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు తన ఖాతాలో వేసుకొని స్టార్ హీరోగా పేరు సంపాదించారు. అయితే గతంలో వరుసగా ఫ్లాపులు ఎదురైన మళ్లీ విజయాల బాట అందుకున్నారు ఎన్టీఆర్.

Jr NTR's new investment in Hyderabad
ఇక టెంపర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కెరియర్ ఒక్కసారిగా మరుపు తిరిగింది ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ ని కూడా చవి చూడలేదు. ఎన్నో చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించిన ఎన్టీఆర్ ఇటీవలే RRR చిత్రంతో గ్లోబల్ స్టార్ గా కూడా పేరు పొందారు. ప్రస్తుతం కొరటాల శివతో దేవర అనే చిత్రంలో నటిస్తున్నారు ఈరోజు ఎన్టీఆర్ 40వ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ గురించి పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఎన్టీఆర్ కెరియర్లో వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాల గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

నితిన్ హీరోగా డైరెక్టర్ వివి వినాయక దర్శకత్వంలో వచ్చిన దిల్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాని మొదట ఎన్టీఆర్ కు వినిపించగా.. ఈ సినిమా కథను రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన ఆర్య కథను ముందుగా ఎన్టీఆర్ కు సుకుమార్ చెప్పగా ప్రేమ కథకు తను సరిపోనంటూ రిజెక్ట్ చేశారట.. ఇక మూడో సినిమా డైరెక్టర్ బోయపాటి శ్రీను రవితేజ కాంబినేషన్లో వచ్చిన భద్ర సినిమాని అల్లు అర్జున్ కు చెప్పిన తర్వాత ఎన్టీఆర్కు చెప్పారట. కానీ ఎందుకు ఈ సినిమాని రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కిక్, రాజా ది గ్రేట్, ఊపిరి, శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, నా పేరు సూర్య తదితర చిత్రాలను ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడం జరిగిందట.

Share post:

Latest